క్లాస్ రూమ్ లో ఆ ఇద్దరు టీచర్లు ఎంతటి నీచానికి పాల్పడ్డారో తెలుసా.? ఇలాంటి నీచులని ఏం చేయాలి.?     2018-11-06   11:22:42  IST  Sai Mallula

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. అంతటి ప్రాధాన్యతని ఇస్తాం మనం గురువుకి. పిల్లలకి పాఠాలు చెప్పి…వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పడవలిలో ఉండి ఆ టీచర్లు.. తరగతి గదిలోనే సిగ్గుమాలిన పని చేశారు. వారు చేసిన పనికి మీరు తిట్టుకోవడం పక్కా. ఒకర్నొకరు వాటేసుకొని ఘాటుగా ముద్దు పెట్టేసుకున్నారు. ఆ ఉపాధ్యాయుడు సహోపాధ్యాయురాలిని అసభ్యంగా తాకుతూ ఆ పనిచేయడం గమనార్హం. ఈ ఘటన గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

టీచర్లిద్దరూ క్లాస్‌రూమ్‌లోనే ముద్దు మచ్చట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఆ రాసలీలను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. వీడియో చూసి దెబ్బకు అందరు షాక్. గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఆ టీచర్ చేసిన పనికి నెటిజెన్ల తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అలాంటి నీచులని ఏం చేయాలి.? ఇలాంటి వారు రేపు పొద్దున్న పిల్లలకి ఏం నేర్పిస్తారు.?మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.!