అనాటమీ క్లాస్ చెప్పడం కోసం ఏకంగా బాడీ పార్ట్స్ వేసుకొని

విద్యార్థులకు విద్యా బోధన చేయాలి అంటే ఒక్కొక్క ఉపాధ్యాయులు ఒక్కో పద్దతి పాటిస్తూ ఉంటారు.ఎవరి ప్రయత్నం వారు చేసి విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఉంటారు.

 Teacher Wears Internal Organs Bodysuit To Teach Students-TeluguStop.com

కొందరు కొట్టి పాఠాలు చెప్పాలి అని చూస్తే,కొందరు వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి అంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి వారి కోవకు చెందుతుంది ఈ స్పానిష్ టీచర్ వెరోనికా.

అనాటమీ లెసన్ చెప్పాలి అని ఈ 3 తరగతి ఉపాధ్యాయురాలు ఏకంగా మనిషి బాడీ పార్ట్స్ ప్రింట్ చేసి ఉన్న ఒక సూట్ ని వేసుకొని మరీ వచ్చింది.

వినూత్నంగా పిల్లలకు విద్యను అందించాలని వెరోనికా ఇలాంటి ప్రయత్నం చేసింది.

మానవ అంతర్గత అవయవాలు మృదురితమై ఉన్న ఒక సూట్ ను వేసుకున్న 43 ఏళ్ల వెరోనికా అలానే క్లాస్ రూమ్ లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తుందట.ఎందుకంటే పిల్లలకు అంతర్గత అవయవాలను ఊహించుకోవడం కష్టం అందుకే ఇలా సూట్ ను వేసుకొని వారికి విద్యను అందిస్తే చాలా తొందరగా అర్ధం చేసుకుంటారని ఇలాంటి ప్రయత్నం చేశారట.

అనాటమీ క్లాస్ చెప్పడం కోసం ఏక

అయితే ఆమె క్లాస్ ను బోధించే సమయంలో వెరోనికా భర్త కొన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ ఫోటోలకు 13 వేల రీట్వీట్స్,66 వేల లైక్ లు లభించాయి అంటే మీరే అర్ధం చేసుకోవచ్చు ఎంతగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయో అని.అందరూ కూడా ఆ టీచర్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube