ఈ పంతులమ్మ ఏకంగా  కోటి రూపాయలు జీతం తీసుకుంటోందట…  

Teacher Uttar Pradesh - Telugu Crime News, One Crore Salary, Teacher Scam, Uttar Pradesh

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బులు సంపాదించాలనే వ్యామోహంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమేగాకుండా పదవీ బాధ్యతలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు.తాజాగా ఓ ఉపాధ్యాయురాలు ఏకంగా 25  పైగా పాఠశాలల్లో పని చేస్తున్నట్లు పత్రాలను సృష్టించి సంవత్సరానికి దాదాపుగా కోటి రూపాయలకు పైగా వేతనం తీసుకుంటున్నట్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విద్యా అధికారులు గుర్తించారు.

 Teacher Uttar Pradesh

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో  అనామిక శుక్ల అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది.అయితే ఇందులో వింత ఏముందనుకుంటున్నరా…? ఈ ఉపాధ్యాయురాలు ఏకంగా ప్రభుత్వానికి చెందినటువంటి 25 పాఠశాలలో పని చేస్తున్నట్లు చూపిస్తూ గత కొద్ది నెలలుగా దాదాపుగా కోటి రూపాయలకు పైగా వేతనం తీసుకుంటోంది.అయితే ఈమెను గుర్తించడంలో ప్రభుత్వాధికారులు కాస్త నిర్లక్ష్యం వహించడంతో ప్రస్తు అనామిక శుక్లా పరారీలో ఉన్నట్లు సమాచారం.దీంతో పలువురు ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి అనామిక శుక్లా ని పట్టుకునే పనిలో పడ్డారు.

దీంతో ప్రస్తుతం ఈ పంతులమ్మ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.కాగా కొంతమంది నెటిజన్లు ఒకపక్క ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు లేక కష్టపడుతుంటే ఇలాంటి  వాళ్లు మాత్రం అక్రమాలకు పాల్పడుతూ లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

ఈ పంతులమ్మ ఏకంగా  కోటి రూపాయలు జీతం తీసుకుంటోందట…-General-Telugu-Telugu Tollywood Photo Image

మరికొందరు మాత్రం టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన కాలంలో కూడా ప్రభుత్వాన్ని మోసం చేసి కోటికి పైగా జీతం తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలుకి కచ్చితంగా సాలరీ డేటాబేస్ కి సంబంధించి వివరాలు తెలిసి ఉంటాయని కాబట్టి  తొందర్లోనే అనామికను పట్టుకోకపోతే మరింత అనర్థం జరుగుతుందని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test