నాలుగేళ్ళ చిన్నారి పై టీచర్ దుర్మార్గం...వేడి వేడి కిచిడి పోసి...  

Teacher Poured Hot Khichdi On 4 Year Old Who Asked For Extra Egg-child Development Centre,four Years Old Child,kolkat,teacher Poured Hot Khichdi

కన్ను మిన్ను కానకుండా ఒక టీచర్ నాలుగేళ్ళ చిన్నారిపై అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించింది. టీచర్ అంటే పిల్లలకు దిక్సూచి గా పనిచేస్తారు. ఇది తప్పు ఒప్పు అని చెబుతారు..

నాలుగేళ్ళ చిన్నారి పై టీచర్ దుర్మార్గం...వేడి వేడి కిచిడి పోసి... -Teacher Poured Hot Khichdi On 4 Year Old Who Asked For Extra Egg

కానీ అలాంటి టీచర్ చేసిన దుర్మార్గమైన పనికి ఐదేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే…. బెంగాల్ లోని ముర్షీదా బాడ్ జిల్లాలోని రఘు నాథ్ గంజ్ ఏరియా లో ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పిల్లల సంరక్షణ సంస్థ లో ఐదేళ్ల చిన్నారి తనకు మరో గుడ్డు అదనంగా కావాలని అక్కడ ఉన్న టీచర్ సెహరీ ని అడిగింది. దానికి ఆ టీచర్ అత్యంత కర్కశంగా ఆ చిన్నారిపై పొగలు,సెగలు కక్కుతున్న వేడివేడి కిచిడీని తీసుకువచ్చి ఆ చిన్నారిపై పోసింది.

కిచిడి పొసే ముందే ఆ చిన్నారి బట్టలు కూడా తీసేసి మరి ఆ చిన్నారిపై తన దుర్మార్గాన్ని బయటపెట్టుకుంది. ఈ ఘటన చూస్తే ఎవరైనా ఇలాంటి ఆడవాళ్ళూ కూడా ఉంటారు అన్న సందేహం కలగక మానదు. పాపం ఆ చిన్నారి పై వేడి వేడి కిచిడి పడడం తో తొడ,కాలు భాగంలో చర్మం కూడా ఊడి వచ్చేసింది.

దీనితో ఆ చిన్నారి ఏడుచుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పడం తో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి… తాను ఏ తప్పూ చెయ్యలేదనీ, అయినా టీచర్ తనను కొట్టారనీ, కిచిడీని తనపై పోశారని ఏడుస్తూ చెబుతుంటే… అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన మహిళ సెహారీ బావాపై లిఖిత పూర్వక కంప్లైంట్ నమోదైందని రఘునాథ్‌గంజ్ పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ మహిళా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

నిజంగా ఇలాంటి మహిళలను ఏమాత్రం క్షమించకుండా తగిన శిక్షలు విధిస్తేనే మళ్లీ ఇలాంటి తప్పులు జరగవు.