అంతరించే మొక్కలే ఆయన నేస్తాలు..రికార్డుకెక్కిన యువ టీచర్

ఈ ప్రపంచంలో అనేక జీవరాశులు బతుకుతున్నాయి.చాలా జంతువులు అంతరించిపోయాయి.అలాగే ఎన్నో రకాల చెట్లు, ధాన్యాలు అనేవి అంతరించిపోయాయి.రాబోవు రోజుల్లో చాలా అంతరించిపోయే అవకాశం కూడా ఉంది.ఇలాంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో మానవుల జీవనం అగమ్యగోచరంగా మారే పరిస్థితి అనేది రానుంది.అందుకే చాలా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

 Teacher Niraal Patel Of Gujarat Giving Seeds Of Rare Species Plants For Free , P-TeluguStop.com

అలాంటి బాధ్యతనే తన భుజాలపై పెట్టుకుని ఓ వ్యక్తి మోస్తున్నాడు.అతడు అంతరించిపోతున్న మొక్కలను కాపాడుతూ సేవ చేస్తున్నాడు.

అతడు చేస్తున్న ఆ కష్టానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ నిర్వాహకులు మంచి అవార్డును ఇచ్చారు.అతని పేరే నిరాల్ పటేల్.

చిన్నతనం నుంచి అతనికి బాధ్యత అనేది అలవడింది.

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాకు చెందిన నిరాల్ మొక్కలను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తాడు.

దాదాపుగా 350 రకాల అరుదైన మొక్కలకు చెందిన విత్తనాలను అతడు ఉచితంగానే ఇవ్వడం విశేషంగా చెప్పొచ్చు.

Telugu Seeds Rare, Gujarat, Indian, Seed Bank, Teacherniraal, Latest-Latest News

నిరాల్ పటేల్ తానే సొంతంగా ఓ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు.అందులో అంతరించిపోతున్న, అరుదైన మొక్కల్ని కాపాడుతూ వస్తున్నాడు.అతడు అరుదైన మొక్కలను, ఆ మొక్కల విత్తనాలను సేకరిస్తూ వస్తున్నాడు.

అంతేకాదు పలువురికి ఆ విత్తనాలను ఇస్తూ అండగా నిలుస్తున్నాడు.కరోనా టైమ్‌లో కూడా నిరాల్ చేస్తున్న సేవకు అరుదైన గౌరవం దక్కింది.

ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పుడు నిరాల్ మాత్రం మొక్కలను సంరక్షిస్తూ మానవ జాతికి అరుదైన సంపదను పంచుతున్నాడు.

Telugu Seeds Rare, Gujarat, Indian, Seed Bank, Teacherniraal, Latest-Latest News

తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఇప్పటి వరకూ అతను కోటికి పైగా విత్తనాలను దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి అతను పలు సత్కారాలను పొందాడు.29 ఏళ్ల నిరాల్ పటేల్ బనస్కాంతలోని పలన్‌పూర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని దంతెవాడలో మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube