విద్యార్థులతో నీచంగా ప్రవర్తిస్తున్న టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం..

మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.ఎన్ని ఘటనలు జరుగుతున్నా.

 Teacher Misbehaviour With Students In Adilabad-TeluguStop.com

ఎలాంటి శిక్షలు వేసినా తప్పు చేసే బుద్ది మాత్రం పోవడం లేదు.ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు.

ఆడపిల్లలకు ఎక్కడ సేఫ్ లేకుండా పోతుంది.కొంత మంది నీచులు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

 Teacher Misbehaviour With Students In Adilabad-విద్యార్థులతో నీచంగా ప్రవర్తిస్తున్న టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఘటన జరిగింది.చదువు చెప్పి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థులపై వికృత చేష్టలు చేస్తున్నాడు.ఈ ఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని బంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఘోట్కూరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఘోట్కూరి గ్రామ పాఠశాలలో పని చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు ఖాదీర్ పిల్లల పై వికృత చేష్టలు ప్రదర్శిస్తున్నాడు.

పిల్లలకు విద్య బుద్దులు చెప్పకుండా వారికీ అస్లీల దృశ్యాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన ఉపాధ్యాయుడే పిల్లలపై ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడు.

ఈ విషయాన్నీ తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఒకేసారి పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయుడిని ఒక గదిలో బంధించారు.ఈ వ్యవహారం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఇలాంటి నీచాలు చేస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.

విద్య శాఖ అధికారులు ఆ పాఠశాలకు చేరుకొని జరిగిన విషయం అంతా తెలుసుకున్నారు.

ఆ ఉపాధ్యాయుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.అయితే ఖాదీర్ గతంలో కూడా ఇలాంటి ఘటనలో చిక్కుకుని అరెస్ట్ అయినా కూడా ఇంకా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.

#Kadeer #Mis Behavior #Students #Arrested #Adilabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు