తలస్నానం చేశారు అంటూ 120 మంది విద్యార్థినులపై టీచర్ దాడి  

Teacher Beatsstudents For Doing Head Bath Telugustop - Telugu Corona Virus, Head Bath, Janagama Distict, Kasthuriba Gandhi Womens Hostel, Kasturba Gandhi Womens School Teacher Beats Students For Doing Head Bath, Raghunathapally Womens Hostel, Womens Hostel

చిన్న చిన్న కారణాలతో హాస్టల్ లో ఉన్న విద్యార్ధులపై నిర్వాహకులు,సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తూ చుక్కలు చూపిస్తున్నారు.తాజాగా కేవలం తలస్నానం చేశారు అన్న ఒక్క కారణం తో సుమారు 120 మంది విద్యార్ధులపై ఒక టీచర్ చితకబాదిన ఘటన జనగామ జిల్లా లో చోటుచేసుకుంది.

 Teacher Beatsstudents For Doing Head Bath Telugustop

జనగామ జిల్లా లోని రఘునాథపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో (కేజీ బీవీ) హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకున్నారు.దీనితో అందరూ తలస్నానం చేశారు.

అయితే వారంతా తలస్నానం చేసి నీళ్లు అన్ని ఖాళీ చేసారు అంటూ కోపగించుకున్న ప్రత్యేక అధికారిని సుమలత విద్యార్థులు అందరిని పిలిపించి వరుసగా నిలబెట్టింది.వారిలో ఎవరైతే తలంటు పోసుకున్నారో వారిని నిలబెట్టి చేతి వేళ్ళపై నిర్ధాక్షిణ్యంగా కొట్టింది.

తలస్నానం చేశారు అంటూ 120 మంది విద్యార్థినులపై టీచర్ దాడి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృధా చేస్తారా అంటూ వారిపై ఆగ్రహం తో దాడి చేసి విరుచుకుపడింది.రంగులతో ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అందుకే తల స్నానం చేసామని చెప్పినా ఆ అధిరానిని వినిపించుకోలేదు.

విచక్షణ కొల్పోయి విద్యార్థులను చితకబాదింది.

విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

సదరు అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా ఈ ఘటనపై అధికారిణి సుమలత స్పందిస్తూ పాఠశాలలో నీటి కొరత ఉందని, ఓ వైపు కరోనా వైరస్‌ ప్రభావం కూడా ఉన్నందున రంగులు చల్లుకోవద్దని విద్యార్థులను హెచ్చరించామని చెప్పారు.

అయినా విద్యార్థులు తమ మాట పట్టించుకోలేదంటూ చెప్పుకొచ్చారు.అయితే కారణం ఏదైనా విద్యార్థులను అలా చేతి వేళ్ళపై కొట్టడం తో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం మండిపడుతున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test