స్కూల్ ఎగ్గొట్టారని విద్యార్థులను చితకబాదిన టీచర్  

Teacher Beats Students For Not Attending The Classes In Gujrat-

స్కూల్ కి ఎగొట్టి స్నేహితుడి ఇంటిలో ఆడుకుంటున్న విద్యార్థులను వీరావేశం తో టీచర్ వారిపై చేయి చేసుకోవడం ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది.ఈ ఘటనపై విద్యార్థుల తల్లి దండ్రులు కూడా టీచర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే… గుజరాత్ లో ఒక స్కూల్ లో ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఎగ్గొట్టి మరి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు.అయితే ఎలానో విషయం తెలుసుకున్న టీచర్ అక్కడకి వెళ్లి ఆ విద్యార్థులను కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్లు బాదారు...

Teacher Beats Students For Not Attending The Classes In Gujrat--Teacher Beats Students For Not Attending The Classes In Gujrat-

అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న నీళ్ల పైపు తో కూడా ఒక విద్యార్థి పై చేయి చేసుకోవడం తో ఆ విద్యార్థులు గాయాలపాలైనట్లు తెలుస్తుంది.దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు ఎగ్గొడితే ఇలా గాయాలపాలయ్యేటట్లు కొట్టాలా అంటూ,వారిపై చర్యలు తీసుకోవాలి అని అంటూ డిమాండ్ చేస్తున్నారు.స్కూల్ కి రెగ్యులర్ గా ఎగ్గొడుతున్న నేపధ్యాలు అసలు వాళ్లు ఎక్కడున్నారు అని టీచర్ ఎంక్వైరీ చేయగా స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించి ఇలా అక్కడకు వెళ్లి మరీ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

Teacher Beats Students For Not Attending The Classes In Gujrat--Teacher Beats Students For Not Attending The Classes In Gujrat-

అనంతరం వారిద్దరిని చిన్న కేజ్ లాంటి దానిలో కాసేపు బందించి ఉంచారు.అయితే తతంగం అంతా కూడా అక్కడే ఉన్న ఎవరో తమ కెమెరా లో బంధించడం తో ఈ వీడియో వెలుగు లోకి వచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.విద్యార్థులను చేయి చేసుకోవడమే కాకుండా టీచర్ వారిని కొడుతున్నప్పుడు నవ్వుతుండడం విశేషం.