వైసీపీలో గురుశిష్యులు మ‌ళ్లీ కలిశారే.. భ‌లే రాజ‌కీయం..!  

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా రేగిన పెను తుఫాను.అంతే స్పీడుగా చ‌ల్లారిపోయిందా?  రాజ‌కీయ గురు శిష్యులు.మాజీ మంత్రి పిల్లి శుభాష్ చంద్ర‌బోస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు క‌లిసిపోయారా? అంటే.ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

TeluguStop.com - Teacher And Student Again Met In Ysrcp

తాజాగా ద్వారం పూడి ఇంటికి బోసు వెళ్లారు.ఒక‌వైపు కేబినెట్ మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ద్వారంపూడి స్వ‌గృహంలో ఈ ఇద్ద‌రి మీటింగ్ ఏర్పాటు చేశారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు తాను మంత్రి కాక‌పోయినా.కేబినెట్ మీటింగ్‌కు సీఎం చొర‌వ‌తో బోసు కూడా హాజ‌ర‌వుతున్నారు.

TeluguStop.com - వైసీపీలో గురుశిష్యులు మ‌ళ్లీ కలిశారే.. భ‌లే రాజ‌కీయం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే.ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న ద్వారంపూడి ఇంటికి వెళ్లారు.

ద్వారంపూడి కూడా బోసును ఆత్మీయంగా ఆహ్వానించి భోజ‌న ఏర్పాట్లు చేశారు.అయితే.వీరి విష‌యం ఎందుకు ఆస‌క్తిగా మారిందంటే.రెండు రోజుల కింద‌ట డీఆర్‌సీ మీటింగ్‌లో పేద‌ల‌కు ఇళ్ల విషయంపై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు అవినీతి జ‌రుగుతోందంటూ.

బోసు విరుచుకుప‌డ్డారు.పైగా ఆయ‌న కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోనే కంప్లెయింట్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని కూడా చెప్పుకొచ్చారు.

దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ద్వారంపూడి కూడా అదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

కొడ‌క‌.అంటూ.

బోసుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఒకానొక ద‌శ‌లో బోసుపై భౌతిక దాడికి కూడా ప్ర‌య‌త్నించారు.

ఇది పెను దుమారంగా మారింది.

Telugu Ap, Cabinet Meeting, Dwarampudi Chandra Sekhar Reddy, East Godavari District, Jagan Mohan, Latest News, Pilli Subash Chandra Bose Reddy, Political News, Political Stratagies, Political War-Political

సీనియ‌ర్‌లు కావ‌డం.రాజ‌కీయంగా, ఆర్థికంగా కూడా ద్వారంపూడితో జ‌గ‌న్‌కు సంబందాలు ఉండ‌డంతో ఈ విష‌యాన్ని వెంట‌నే తేల్చేయాల‌ని అనుకున్న జ‌గ‌న్‌.వెంట‌నే దీనిపై పంచాయ‌తీ పెట్టారు.

ఏం జ‌రిగిందో ఏమో.క‌ట్ చేస్తే.బోసు ఏకంగా ద్వారంపూడి ఇంటికి విందుకు వెళ్లారు.ఈ క్ర‌మంలో ఎంపీ గీత కూడా ఉన్నారు.సాద‌రంగా ఆహ్వానించిన ద్వారం పూడి.బోస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ప్పు అని ఒప్పుకొన్నారు.

బోసు కూడా త‌న శిష్యుడిని ఏమీ అనుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఈ వివాదం టీక‌ప్పులో తుఫానుగా మారి పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కానీ, అంత‌ర్గ‌తంగా చూస్తే.మాత్రం ఎవ‌రి విష‌యాల్లో ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్ద‌నే గ‌ట్టి వార్నింగ్ జ‌గ‌న్ నుంచి వ‌చ్చింంద‌ని.

అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.అంటే.

ఇక‌పై ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేసుకుంటారే త‌ప్ప‌.ఎవ‌రి విష‌యాల్లోనూ మ‌రొక‌రు జోక్యం చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని తెలుస్తోంది.

#Cabinet Meeting #PilliSubash #Jagan Mohan #EastGodavari #Political War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teacher And Student Again Met In Ysrcp Related Telugu News,Photos/Pics,Images..