టీ అమ్ముకుంటున్న వ్యక్తి విన్నూత నిరసన.. ప్రధాని మోడీ షాకయ్యేలా.. ?

కరోనా రావడానికి ముందు ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి ఉన్నా కన్నీళ్లు పెట్టుకునే అంతలా లేవని చెప్పవచ్చూ.ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ అంటూ వచ్చిందో అప్పటి నుండి సామాన్యుల బాధలు స్వర్గానికి తక్కువ, నరకానికి ఎక్కువలా మారిపోయాయి.

 Tea Man Who Innovatively Conveyed His Displeasure To Prime Minister Modi-TeluguStop.com

అప్పటి వరకు మోడీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని బీజేపీ ఎడతెగని ఊపన్యాసాలు ఇచ్చేది.అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సామాన్యుల కన్నీళ్లు తుడిచినట్లుగా మొసలి కన్నీరు కార్చేవి.

కానీ కరోనా వచ్చాక పేదలను పట్టించుకునే నాధుడే కరువైయ్యారు.

 Tea Man Who Innovatively Conveyed His Displeasure To Prime Minister Modi-టీ అమ్ముకుంటున్న వ్యక్తి విన్నూత నిరసన.. ప్రధాని మోడీ షాకయ్యేలా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Modi, Prime Minister, Send Rs 100, Tea Stall‌ Man-Latest News - Telugu

నిజానికి ఒక పేదవానికి కావలసింది కూడూ, గుడ్డ, నీడ.కానీ ఈ మూడూ ఇప్పుడు అందని ద్రాక్షలా మారాయి.పెట్రోల్ లీటర్ వంద, వంటనూనే రెండు వందలు, గ్యాస్ వెయ్యి, కరెంట్ బిల్లు సంగతి చెప్పలేము.

ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుని రక్తాన్నీ జలగలా పీల్చుతున్నారని ప్రతి పక్షాలు చేస్తున్న గోల వినే వారే లేరు.ఇలాంటి సమయంలో కడుపు మండిన మహారాష్ట్ర బారామతి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదురుగా టీ స్టాల్‌ నడుపుతున్న అనిల్ మోరే అనే వ్యక్తి.

ప్రధాని మోడీకి తన అసంతృప్తిని విన్నూతంగా తెలియచేశారు.ఓ లేఖ రాసి, అందులో వంద రూపాయలు కూడా పెట్టి, ప్రధాని మోడీ గడ్డం పెంచుతున్నారు.ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని పేర్కొంటూ నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి వంద రూపాయాలు పంపుతున్నాను.దానితో గడ్డం గీయించుకోని కాస్త పేదవారి గురించి ఆలోచించండని తెలియచేశారు.

#Send Rs 100 #Modi #Prime Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు