టీపై పేరుకున్న మీగ‌డ‌ను తీయకుండానే తాగుతున్నారా? అయితే ఏమౌతుందో తెలుసా?  

టీ అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి.ఏ కాలంలోనైనా వేడి వేడిగా ఉండే టీ అలా నెమ్మ‌దిగా గొంతులోకి దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా.ముఖ్యంగా చ‌లికాలంలోనైతే టీ ఇచ్చే ఉత్తేజ‌మే వేరు..

Tea Pai Perukunna Megada Ni Tagocha--

నీర‌సంగా, మ‌బ్బుగా ఉన్న‌వారు కూడా టీ తాగితే ఉత్తేజం పొందుతారు.ఉత్సాహంగా ప‌నిచేస్తారు.అది స‌రే, ఇంత‌కీ టీ తాగేట‌ప్పుడు మీరు ఒక‌టి గ‌మ‌నించారా.

? అదేనండీ… చాయ్ మీద మీగ‌డ తెట్టులా పేరుకుపోతుంది చూశారా.? అవును, అదే.అయితే ఏంటంటారా.? ఏమీ లేదండీ… అలా మీగ‌డ పేరుకుపోయిన టీని తాగితే మంచిదా.? లేదంటే ఆ మీగ‌డ తీసేసి చాయ్ తాగాలా అన్న‌దే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది.

మ‌రి దాని గురించి తెలుసుకుందామా.?

సాధార‌ణంగా అలా చాయ్ మీద మీగ‌డ పేరుకుపోవ‌డ‌మ‌నేది అందులో క‌లిపే పాల వ‌ల్ల వ‌స్తుంది.పాల‌ను కొద్దిగా వేడి చేసిన‌ప్పుడు అందులో ఉండే తేలిక‌పాటి కొవ్వులు దాని మీద పొర‌లా వ‌చ్చి మీగ‌డ‌లా పేరుకుంటాయి.

ఆ క్ర‌మంలో ఆ పాల‌తో చాయ్ పెడితే ఆ చాయ్‌పై కూడ మీగ‌డ పొర‌లా వ‌స్తుంది.దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.అవేమిటంటే….

మీగ‌డలో పాల‌క‌న్నా అధికంగా కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి.

పాల‌క‌న్నా దాదాపుగా 20 నుంచి 36 శాతం వ‌ర‌కు అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్‌, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.ఇవి మ‌న శ‌రీరానికి నిత్యం ఎంతో కొంత అవ‌స‌ర‌మే.అయితే అవి మోతాదుకు మించితే మాత్రం రక్త నాళాల్లో పేరుకుపోతాయి.దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.మంచి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.త‌ద్వారా దీర్ఘ‌కాలికంగా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

క‌నుక టీ తాగే వారు మీగ‌డ‌ను తీసేసి తాగితేనే మంచిది.అయితే అది మోతాదుకు త‌క్కువైతే మాత్రం మీగ‌డ ఉన్నా ఏమీ కాదు.అది ఎక్కువైతేనే స‌మ‌స్య‌.

మ‌రి, ఎంత మోతాదు వ‌ర‌కు ఆ ఫ్యాట్స్‌ను మ‌నం తీసుకోవ‌చ్చు అంటే, రోజుకు 2 గ్రాముల వ‌ర‌కు వాటిని తిన‌వ‌చ్చు.అంత‌కు మాత్రం మించ‌కూడ‌దు.మించితే ఏం జ‌రుగుతుందో పైన చెప్పాం క‌దా.!