మన హైదరాబాద్ లో చాయ్ రూ.1000.. ఒక్కసారి టేస్ట్ చేస్తే..!

మన హైదరాబాద్ అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి.ఇక్కడ ఫుడ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.

 Tea Crazy Hyderabad Gets Niloufer Cafes Rs 1000 Tea-TeluguStop.com

టూరిస్టులకు కావలసిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మన హైదరాబాద్ లో లభిస్తాయి.ఇక హైదరాబాద్ దమ్ బిర్యానీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.

మన హైదరాబాద్ దమ్ బిర్యానీ కి అయితే వరల్డ్ వైజ్ ఫ్యాన్స్ ఉన్నారు.దీనిని ఒక్కసారైనా టేస్ట్ చెయ్యాలని అనుకుంటారు.

 Tea Crazy Hyderabad Gets Niloufer Cafes Rs 1000 Tea-మన హైదరాబాద్ లో చాయ్ రూ.1000.. ఒక్కసారి టేస్ట్ చేస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇక్కడి ఇరానీ చాయ్ కూడా ఎంత ఫేమస్ నో చెప్పాల్సిన అవసరం లేదు.పాత బస్తీ లోని ఇరానీ చాయ్ రుచి మరి ఎక్కడ రాదని చాయ్ లవర్స్ చెబుతూ ఉంటారు.

అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండ టేస్ట్ చెయ్యాలని అనుకుంటారు.ఇక మన హైదరాబాద్ లో మరొక చాయ్ ఫేమస్ అయ్యింది.

దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించు కుంటున్నారు.

అంత స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా.అది స్పెషల్ చాయ్ కాబట్టే దాని రేటు రూ.1000 పలుకుతుంది.మైమరపించే ఘుమఘుమలాడే ఈ చాయ్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయట.ఇది బంగారు వర్ణం లో ఉండడమే కాకుండా అన్ని చాయ్ లాగా కాకుండా ఒక అద్భుతమైన సువాసనతో అమోఘమైన టేస్ట్ తో ఉంటుందట.

మరి ఇంతకీ ఈ అదిరిపోయే చాయ్ తాగాలంటే ఎక్కడికి వెళ్లాలంటే.

Telugu Assam, Brahmaputra River, Golden Tips, Hyderabad, Hyderabad Chai, Maija Golden Tips Tea, Niloufer Cafes, Rare Tea Powder, Tea Crazy Hyderabad Gets Niloufer Cafes Rs 1000 Tea, Tea Rs.1000-Latest News - Telugu

మన హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ లో ఈ అద్భుతమైన చాయ్ ను 1000 రూపాయలకు అందుబాటులో ఉంది.దీనిని మీరు ఆస్వాదిస్తూ తాగొచ్చు.ఇది ఒక అరుదైన చాయ్ పత్తా తో తయారు చేస్తారట.

అస్సోమ్ లోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతం మైజాన్ టీ తోటల్లో మాత్రమే ఈ చాయ్ పత్తా లభిస్తుందట.గోల్డెన్ టిప్స్ గా పేరు పొందిన ఈ తేయాకు సంవత్సరంలో ఒకసారి మాత్రమే లభిస్తాయట.

అందుకే వాటికీ అంత డిమాండ్.

Telugu Assam, Brahmaputra River, Golden Tips, Hyderabad, Hyderabad Chai, Maija Golden Tips Tea, Niloufer Cafes, Rare Tea Powder, Tea Crazy Hyderabad Gets Niloufer Cafes Rs 1000 Tea, Tea Rs.1000-Latest News - Telugu

వీటిని జాగ్రత్తగా కోసి, ఆరబెట్టి, పొడి చేస్తారట.ఈ పొడి ఎక్కువగా లభించక పోవడం వల్ల ఈ చాయ్ పత్తా కు అంత డిమాండ్.వ్యాపారులు ఈ అరుదైన టీ పౌడర్ కొనేందుకు ఎంత ధర అయినా పెట్టేందుకు వెనుకాడరట.

ఈ పొడిని వేలం ద్వారా మాత్రమే సొంతం చేసుకోవచ్చు.తాజాగా నీలోఫర్ యజమాని ఈ పొడిని వేలంలో 75 వేలకు దక్కించుకున్నాడట.

ఒక చాయ్ కోసం కేవలం 4 గ్రాముల టీ పొడిని మాత్రమే ఉపయోగిస్తారని కేఫ్ యజమాని చెబుతున్నాడు.మరి ఈ అరుదైన చాయ్ ను చాయ్ లవర్స్ ఒక్కసారి టేస్ట్ చెయ్యాల్సిందే.

#Rare Powder #Assam #Hyderabad #Golden Tips #Hyderabad Chai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు