TDP BJP : టీడీపీ పతనమే బీజేపీ పంతమా ? ఈడి, ఐటీ దాడుల వెనుక.. ?

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీని ఓడించి ఆ స్థానంలోకి రావాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భావిస్తుండగా, టిడిపిని మరింత బలహీనం చేసి జనసేన సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో బిజెపి ఉంది.అందుకే జనసేన టిడిపి వైపు వెళ్లకుండా బీజేపీ నేతలు కట్టడి చేయగలిగారు.

 Tdp's Downfall Is Bjp's Downfall? Behind Ed And It Attacks , Ed, It Raids, Jagan-TeluguStop.com

ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది అంటూ ప్రకటనలు చేస్తున్నారు.టిడిపిని పూర్తిగా బలహీనం చేస్తేనే 2029 ఎన్నికల నాటికైనా బిజెపి జనసేన బలం పుంజుకుంటుంది అనే లెక్కల్లో కమలనాథులు ఉన్నారు.

టీడీపీ ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు.

అలాగే అనంతపురం జిల్లాలో టిడిపి కీలక నేతగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తుల పైనా ఈడి అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ విధంగా టిడిపిలో ఆర్థికంగా బలమైన నేతలే టార్గెట్ గా ఇప్పుడు ఐటి, ఈడి రైడ్స్ జరుగుతుండడం తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

రాబోయే ఎన్నికల నాటికి టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందిస్తారు అనుకున్న పారిశ్రామికవేత్తలు, కీలక నాయకులే టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలను  రంగంలోకి దింపుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రభాకర్ రెడ్డి కి చెందిన 22 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది .అలాగే పెనుకొండలోని టిడిపి నేత సబిత ఇంట్లో సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

సబిత భర్త రైల్వే కాంట్రాక్టర్ గా ఉండడంతో, అనేక ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఈడి అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.ఇంకా అనేకమంది టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.
 

Telugu Ap Cm, Ap, Bjpjanasena, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Political

అలాగే విజయవాడలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి,  అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రులలో ఈడి, ఐటి సాదాలు జరిగాయి.రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో అనేక అవకతవకులు జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు.ఈ రెండు ఆసుపత్రులు టిడిపి సానుభూతిపరులవే కావడం గమనార్హం.ఈ రెండు ఆసుపత్రిలో తనిఖీలు సందర్భంగా 43 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలిందట.అక్కినేని ఆసుపత్రిలో అదనపు భవనం నిర్మాణం కోసం వసూలు చేసిన సొమ్ములను హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించినట్లు ఈడి ,ఐటి అధికారులు గుర్తించారట.ఇవే కాకుండా గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు అయిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 370 కోట్ల రూపాయలు చెల్లింపులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు.26 మందికి నోటీసులు జారీ చేశారు.ఇందులో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ,మాజీ ఎండి గంటా సుబ్బారావుతో పాటు , అనేకమంది ఉన్నారు.

ముఖ్యంగా ఈ వ్యవహారంలో అప్పటి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ఉండడంతో ఆయనను కూడా విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు అందాయి.ప్రస్తుత పరిస్థితి చూస్తే టిడిపికి చెందిన మరికొంతమంది నేతల ఆర్థిక లావాదేవీల పైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు దిగే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube