టీడీపీలోమళ్లీ ఎన్టీఆర్ ప్రస్తావన జోరందుకుందే !

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మొదలయ్యింది.టీడీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఒక్కడే పార్టీని గట్టెక్కించగలడని మెజార్టీ టీడీపీ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.

 Tdpleaders Wantto Juniour Ntr For Apelections Ntr-TeluguStop.com

అయితే చంద్రబాబు నాయకత్వం మీద వారికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నా పార్టీకి తిరిగి పునర్వైభవం రావాలంటే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని భావిస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు టీడీపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 175 సీట్ల కు గాని కేవలం 23 సీట్లే దక్కడం, గెలిచిన వారిలో కూడా చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు చేస్తుండడంతో ఈ రకమైన చర్చ మొదలయినట్టుగా కనిపిస్తోంది.ఇదే సమయంలో చంద్రబాబు తర్వాత ఆ పార్టీ పగ్గాలు అందుకోబోయేది ఎవరన్న ప్రశ్న ఇటు నాయకులను, అటు కార్యకర్తలు, అభిమానుల్లోనూ చర్చగా మారింది.

Telugu Chandrababu, Lokesh, Tdp, Tdp Ntr Ap-Telugu Political News

చంద్రబాబు వారసుడిగా, రాజకీయ వారసుడిగా ఉన్న లోకేష్ తనని తాను నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.తెలుగుదేశం పార్టీ ఓటమి తరువాత లోకేష్ సోషల్ మీడియా బాధ్యత తీసుకుని ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు.అయినా ఆశించిన స్థాయిలో లోకేష్ క్రెడిట్ పెరిగాకపోగా లోకేష్ జనాల్లోకి రాలేడని, ఆయన ట్విట్టర్ పిట్ట అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.దీంతో ఈ మధ్యనే జనం బాట పట్టారు.

అయినా స్పందన మాత్రం అనుకున్న రేంజ్ లో లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్లే బరువు, బాధ్యత ఎన్టీఆర్ ఒక్కరే సమర్ధవంతంగా తీసుకెళ్లగలరని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Chandrababu, Lokesh, Tdp, Tdp Ntr Ap-Telugu Political News

జూనియర్ ఎన్టీఆర్ సామర్ధ్యం ఏంటో అందరికి తెలిసిందే.గతంలో టీడీపీకి ప్రచారం నిర్వహించి తాత ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.అదే జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేశ్ పరిస్థితి ఏంటన్నది కూడా చర్చనీయాంశమైంది.2019 ఎన్నికలకు ముందు పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు ఎన్టీఆర్‌ను కోరినట్టు ప్రచారం జరిగింది.అయితే, ప్రస్తుతం ఆ పనిచేయలేనని, పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు తప్పకుండా వస్తానని సున్నితంగా తిరస్కరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.తన తాత స్థాపించిన పార్టీ కోసం తన కట్టే కాలేవరకు పోరాడతానని గతంలో ఎన్టీఆర్ అనేకసార్లు చెప్పాడు.

చంద్రబాబు తర్వాత ఆ పార్టీని ఆ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లగలిగే ఆయనకు మాత్రమే ఉందని లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే అనుకున్న రేంజ్ లో పార్టీ బలపడదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై టీడీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube