త్వరలో టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న మరో నేత  

Tdp Leader Ayyanna Patrudu Brother Ready To Join In Ycp Party-chandrababu Naidu,sanyasi Patrudu,tdp

ఒకపక్క తెలంగాణా లో ఏమాత్రం టీడీపీ పార్టీ కి అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలంగాణా లో ఒక వెలుగు వెలిగిన టీడీపీ పార్టీ దాదాపు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తుడిచిపెట్టుకోపోయిందనే చెప్పాలి.

Tdp Leader Ayyanna Patrudu Brother Ready To Join In Ycp Party-chandrababu Naidu,sanyasi Patrudu,tdp-TDP Leader Ayyanna Patrudu Brother Ready To Join In YCP Party-Chandrababu Naidu Sanyasi Tdp

అయితే ఇప్పుడు ఏపీ లో కూడా టీడీపీ పార్టీ కి అదే పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి మూటగట్టుకున్న తరువాత దాదాపు చాలా మంది నేతలు ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు జంప్ చేసిన విషయం విదితమే.

Tdp Leader Ayyanna Patrudu Brother Ready To Join In Ycp Party-chandrababu Naidu,sanyasi Patrudu,tdp-TDP Leader Ayyanna Patrudu Brother Ready To Join In YCP Party-Chandrababu Naidu Sanyasi Tdp

ఇప్పుడు తాజాగా విశాఖ లో మరో టీడీపీ నేత వైసీపీ పార్టీలోకి జంప్ చేయనున్నట్లు తెలుస్తుంది.విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీ కి గట్టి ఝలక్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

సన్యాసి పాత్రుడు టీడీపీ పార్టీ ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఆయన త్వరలో టీడీపీ కి గుడ్ బై పలకనున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్న విషయం విదితమే.ఈ క్రమంలో విశాఖ నగరంలో అడుగుపెట్టిన లోకేష్ కు ఘన స్వాగతం కూడా లభించింది.అయితే ఇలాంటి సమయంలో సన్యాసి పాత్రుడు తీసుకున్న నిర్ణయం పైనే సర్వత్రా చర్చ కొనసాగుతుంది.