ఆ నేతల ఫీలింగ్ : జనసేన ఉందిగా టీడీపీలో ఉన్నా వేస్టే !

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో పాటు బలమైన పార్టీ క్యాడర్ ఉండి, ఆయా నియోజకవర్గాల మీద బాగా పట్టున్న నాయకులు సైతం ఓటమి చవి చూశారు.అయితే పార్టీ అధినాయకత్వం ఓటమి నుంచి త్వరగానే తేరుకుని ఇప్పుడు అధికార పార్టీకి చుక్కలు చూపించేందుకు అసెంబ్లీ వేదికగా గెంతెత్తి పోరాడుతున్నారు.

 Tdpkapu Leadersthinking About Janasenaparty-TeluguStop.com

కానీ నాయకులు మాత్రం ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు.తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో ఒక సామజిక వర్గానికి చెందిన నేతలంతా ఈ మధ్య ఒక సమావేశం పెట్టుకుని బీజేపీలోకి జంప్ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా పెట్టుకున్నారు.

ఆ తరువాత చంద్రబాబు ను కలిసాక మనసు మార్చుకుని సైలెంట్ గా ఉంటున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న ‘కాపు’ సామాజికవర్గం నాయకుల ఆందోళన అంతా ఇప్పుడు జనసేన గురించేనట.ప్రస్తుతం మనమంతా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదని, జనసేన రాజకీయాల్లో ఉన్నంత కాలం టీడీపీ లో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదనేది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.2014 ఎన్నికల్లో జనసేన కలిసి ఉండటంతో ఆ ఓటు బ్యాంక్ కలిసొచ్చి విజయం వారించండని వీరంతా చర్చించుకుంటున్నారట.పవన్ ను దూరం చేసుకుంటే తమ రాజకీయ జీవితం ముగిసినట్లేనని వీరంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారట.ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు కు చెప్పేందుకు వీరంతా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

-Telugu Political News

ఈ నేతలంతా ఇదే అభిప్రాయంలో ఉండగానే బీజేపీ రంగంలోకి దిగి వీరందరిని తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతోంది.ఇప్పటికే కన్నా లక్ష్మి నారాయణ సారధ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పార్టీలోకి వచ్చే వారికి పదవుల విషయంలో హామీలు ఇస్తూ వారిని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.టీడీపీ లో ఉంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని బీజేపీ లోకి వస్తే తిరుగుండదంటూ వారికి హితబోధ చేస్తున్నారట.

దీంతో ఎటు వెళ్లాలో తెలియక వీరంతా సతమతం అయిపోతున్నారట.ప్రస్తుతం వైసీపీ అధికారంలో మరో ఐదేళ్లపాటు ఉంటుంది.ఈ ఐదేళ్లు టీడీపీనే నమ్ముకుని ఉంటే రాజకీయ ఇబ్బందులతో పాటు ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో ఆర్ధిక భారం అంతా మోయాల్సి వస్తుందని వీరంతా భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube