ఎడిటోరియల్ : ఆ పార్టీల్లో కమ్మ, రెడ్లకు గడ్డుకాలమే ?  

TDP ysrcp high importence on bc communitys TDP, YSRCP, Ap, Jagan, Chandrababu, BC Community, Capu, Kamma, Reddy Community, YSRCP Governament - Telugu Bc Community, Capu, Chandrababu, Jagan, Kamma, Reddy Community, Tdp, Tdp Ysrcp High Importence On Bc Communitys, Ysrcp, Ysrcp Governament

రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో చెప్పలేం.అలా అకస్మాత్తుగా వచ్చిన అదృష్టం వారిని అందలం ఎక్కిస్తుంది.

TeluguStop.com - Tdp Ysrcp Partys Are Very Importance Prayarty On Bc Communitys

ఇప్పుడు అదే విధంగా ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల్లో బీసీలకు ఎక్కడాలేని ప్రాధాన్యం లభిస్తోంది.ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీసీ నినాదాన్ని తల కెత్తుకుని రాజకీయంగా ఈ రెండు పార్టీలు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బీసీల ప్రాధాన్యత ఏమిటో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాగా తెలిసొచ్చింది.అంతకుముందు వరకు టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడుతూ, వచ్చిన బీసీ సామాజికవర్గాల్లో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.

TeluguStop.com - ఎడిటోరియల్ : ఆ పార్టీల్లో కమ్మ, రెడ్లకు గడ్డుకాలమే -Political-Telugu Tollywood Photo Image

దీనికి కారణం టీడీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం, కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, భారీ ఎత్తున నిధులు కేటాయింపు తో పాటు, అన్ని పదవుల్లోనూ వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.

కమ్మ సామాజిక వర్గంతో పాటు, కాపులకు అత్యధిక ప్రాధాన్యత దక్కడం, బీసీలను పట్టించుకోనట్టు వ్యవహరించడం వంటి కారణాలతో, టీడీపీకి బీసీలు దూరం అయ్యారు.

దాని ప్రభావం ఏంటో 2019 ఎన్నికల్లో టీడీపీ చవిచూసింది.వైసిపి 2019 ఎన్నికల ప్రచారం లో కాపు రిజర్వేషన్ అంశం పై జగన్ చేసిన ప్రకటన పెద్ద సంచలనమే.

కాపులకు రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పి చంద్రబాబులా మోసం చేయను అని, రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ జగన్ చేతులెత్తేశారు.దీంతో ఒక్కసారిగా బీసీల్లో వైసీపీపై అదరణ పెరిగింది.

అలాగే టికెట్ల కేటాయింపు, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం, మంత్రి పదవులతో పాటు కీలకమైన అన్ని విభాగాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం పెంచడం, తాజాగా బిసి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం, ఇలా ఎన్నో కారణాలు వైసీపీ ప్రభుత్వం పై ఆదరణ పెరిగింది.

 ఇంత వరకు ఈ రెండు పార్టీల వ్యవహారం ఇలా ఉంటే, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో టీడీపీలో కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లుగా, కనిపిస్తున్నారు.

  పార్టీకి సంబంధించి ఇటీవల నియమించిన  ఈ కమిటీల్లో ఎక్కువ శాతం బీసీ, ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ముందు ముందు ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే విధంగా చంద్రబాబు ఆలోచన ఉంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, రెడ్డి సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు.జగన్ చుట్టూ ఉండే కొంతమంది నాయకులు తప్ప పెద్దగా రెడ్డి సామాజిక వర్గం, లబ్ధి పొందినట్టు కనిపించడం లేదు.

ముందు ముందు కూడా టీడీపీలో కమ్మ, వైసీపీ లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం మరింతగా తగ్గే ఛాన్స్ లేకపోలేదు.  పూర్తిగా ఈ రెండు పార్టీలు బీసి లను ఎవరు ఎక్కువగా ప్రసన్నం చేసుకుంటే వారికే మళ్లీ అధికారం దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు.

.

#Capu #Chandrababu #Kamma #TDPYsrcp #BC Community

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Ysrcp Partys Are Very Importance Prayarty On Bc Communitys Related Telugu News,Photos/Pics,Images..