తిరుమల శ్రీవారిని టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ. కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని, కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదన్నారు.
ఇంత దుర్మార్గ పాలనా అందిస్తున్న జగన్, మంచి మనిషిగా మారాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.సీఎంకు సంబంధం లేకుండా ఎలాంటి కార్యక్రమం జరగదని, మహిళల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా సీఎం జగన్ పాలనా ఉందని అనిత విమర్శించారు
.






