జ‌న‌సేన‌తో క‌లిస్తే ఆ విష‌యంలో టీడీపీకే న‌ష్టం..?

గ‌త కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో పొత్తు రాజ‌కీయాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా ఈ విష‌యంలో టీడీపీ ముందు వరుస‌లో ఉంటోంది.

 Tdp Will Lose In That Matter If It Joins With Janasena .tdp, Janasena,ap Politic-TeluguStop.com

ఎందుకంటే టీడీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రితో అయినా పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్తేనే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మాత్రం ఫ‌లితాలు కూడా వ‌స్తాయో లేదో అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.ఓ వైపు వైసీపీ రెండున్నరేళ్లుగా తిరుగులేని మెజార్టీతో అన్ని ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుగా ఓడిస్తూ వ‌స్తోంది.

ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే వైసీపీ అన్ని పార్టీల కంటే టీడీపీనే ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తూ ఓడిపోస్తోంది.

జ‌న‌సేన లేదంటే బీజేపీ పార్టీలు ఏమైనా కొద్దిగా సీట్లు సాధించినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు గానీ టీడీపీకి మాత్రం బ‌ల‌మున్న ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

దీంతో టీడీపీ ఒంట‌రిపోరు చేస్తే ప్ర‌మాదంలో ప‌డే అవకాశం ఉంద‌ని అంటున్నారు.ఇందు కోస‌మే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఎలాగూ బీజేపీ త‌మ‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ట్లేదు కాబ‌ట్టి జ‌న‌సేన‌తో అయినా పొత్తు పెట్టుకుంటే ప‌వ‌న్ ఇమేజ్ మ‌ళ్లీ త‌మ‌కు కలిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు.కానీ ఓ దిక్కు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Pavan Kalayan, Tdplose-Telugu Politi

మ‌రి బీజేపీని వీడి జ‌న‌సేన టీడీపీతో క‌లుస్తుందా లేదా అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.అయితే జ‌న‌సేన‌కు బీజేపీతో క‌లిసి ప‌నిచేస్తే వ‌చ్చే లాభం క‌న్నా టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తేనే ఎక్కువ సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అండ‌గా ఉంటాన‌ని చెప్ప‌డాన్ని చూస్తే ఈ విష‌యం అర్థం అవుతుంది.

కానీ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి మరో సమస్య ఎదురయ్యే ప్ర‌మాదం కూడా ఉంది.అదేంటంటే జనసేన ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు అడిగే అవ‌కాశం కూడా ఉంది.

ఇది టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారికి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు.అందుకే వారు టీడీపీని క‌ల‌వ‌నీయ‌కుండా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube