అయ్యో చీల్చేసాడే : టీడీపీ కొంపముంచిన జనసేన  

Tdp Was Too Much Effect With Janasena Party-cm Ys Jagan,janasena Party,pawan Kalyan Janasena,tdp,ys Jagan,జనసేన పార్టీ

2014 ఎన్నికల్లో సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యింది. అప్పట్లో అధికారం దక్కించుకోవాల్సిన వైసీపీ, అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. దీనికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్. అయితే అప్పట్లో పవన్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాడు..

అయ్యో చీల్చేసాడే : టీడీపీ కొంపముంచిన జనసేన -TDP Was Too Much Effect With Janasena Party

ఆ ప్రభావం వైసీపీని అధికారానికి దూరం చేసింది. ఇప్పుడు ఆ విధంగానే తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓట్లను జనసేన పార్టీ చీల్చి పరోక్షంగా వైసీపీకి మేలు చేసింది. జనసేనకు పడిన ఓట్లన్నీ టీడీపీ అభ్యర్థులకే పడాల్సిన ఓట్లని లెక్కలు మొదలయ్యాయి.

అయితే ఈ ఎన్నికల ముందు జనసేన ప్రభావం వైసీపీ మీద ఉంటుందని భావించారు.

ఎన్నికల తరువాత ఏపీ రాజకీయాల్లో పవన్ కీ రోల్ పోషిస్తాడని రాజకీయ చర్చలు నడిచాయి. కానీ ఫలితాలు మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి.

టీడీపీ ఓటు బ్యాంక్ ను పవన్ చీల్చడానే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది..

కానీ అలా చీలిన ఓటు ఏదీ జనసేనకు పడలేదు. నేరుగా వెళ్లి వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఈ పరిణామాన్ని మాత్రం జనసేన ఊహించలేదు.

నిన్నటి వరకు నిశ్శబ్ద విప్లవం అంటూ జనసైనికులు ధీమాగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడదే రివర్స్ అయ్యింది.

ఒక దశలో టీడీపీ కూడా జనసేన పార్టీ గురించి భయం వ్యక్తం చేస్తూనే ఉంది. జనసేన ఒంటరిగా పోటీచేస్తే అది టీడీపీ ఓటు బ్యాంకును చీలుస్తుందని భావించింది.

అందుకే పైకి శత్రువులుగా నటించినా, తెరవెనక మాత్రం పవన్ తో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తాడున్నాడనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జనసేన ఏపీలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఆ పార్టీ ఒక్కసీటుకే పరిమితం అవ్వగా టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసింది.