పవన్ కోసం టీడీపీ వెయిటింగ్ ! వదలనంటున్న బీజేపీ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటి అనేది అందరికీ ఎన్నో సందేహాలను మొదటి నుంచి ఇస్తూనే ఉన్నాయి.ఆయన రాజకీయంగా తీసుకునే ప్రతీ స్టెప్ అందరికీ ఆసక్తికరంగానే ఉంటూ వస్తున్నాయి.

 Tdp Waiting On Janasena Alliance-TeluguStop.com

ప్రస్తుతం బీజేపీతో కలిసి పవన్ ముందుకు వెళ్తున్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి సహకారంతోనే ఏపీలో సీఎం కుర్చీలో కూర్చోవాలి అని పవన్ ఆశపడుతున్నారు.

అయితే మొదటి నుంచి బిజెపి జనసేన విషయంలో వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ కు సైతం ఆగ్రహాన్ని కలిగిస్తూనే వచ్చింది.  మిత్రపక్షంగా తాము ఉన్నా,  తమను పట్టించుకోన ట్లుగా బిజెపి వ్యవహరించిన తీరు పవన్ కు మరింత ఆగ్రహం కలిగిస్తూ వచ్చింది.

 Tdp Waiting On Janasena Alliance-పవన్ కోసం టీడీపీ వెయిటింగ్ వదలనంటున్న బీజేపీ  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పవన్ ఎప్పటికప్పుడు సర్దుకుపోతునే వస్తున్నారు.ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి కాకుండా టిఆర్ఎస్ బరిలోకి దింపిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవికి జనసేన మద్దతు ప్రకటించి బిజెపి పై తమకు ఉన్న ఆగ్రహాన్ని ఆ రూపంలో వ్యక్తం చేశారు.

 ఈ పరిణామాలతో ఒక్కసారిగా కంగారుపడిన బిజెపి పవన్ కనుక దూరమైతే ఏపీలో తీవ్రంగా నష్టపోతామని, అదీ కాకుండా తిరుపతి లోక్ సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని, పవన్ సహకారం లేకపోతే అక్కడ గెలవలేము అని అంచనాకు రావడంతోనే , ఒక్కసారిగా స్వరం మార్చాయి.

Telugu Alliance, Ap, Chandrababu Naidu, Jagan, Pavan Kalyan Bjp, Tdp, Tirupathi Elections, Ysrcp-Telugu Political News

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పువ్వులా చూసుకోమని బీజేపీ పెద్దలు తమతో చెప్పారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ ను పదేపదే పొగడ్తలతో ముంచెత్తారు.అయితే బీజేపీతో పొత్తు కారణంగా పవన్ ఏపీలో తీవ్రంగా నష్టపోతున్నారు.రాజకీయంగా మరింత బలం పెంచుకోవాల్సిన సమయంలో ఈ పొత్తు జనసేన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతోంది.

 ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, పోలవరం ప్రాజెక్టు ఇలా అనేక అంశాలలో బీజేపీపై జనాల్లో తీవ్ర ఆగ్రహం ఉంది.బిజెపికి మిత్రపక్షంగా జనసేన ఉండడంతో ఈ అంశంలో ఇరుకున పడాల్సి వస్తోంది.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ని విమర్శిస్తున్న జనసేన కేంద్రంలో బిజెపి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న,  మిత్రపక్షంగా ఉండి తాము ఎందుకు ప్రశ్నించలేకపోతున్నామని, ఏపీకి అన్యాయం చేస్తున్న బిజెపిని పవన్ ప్రశ్నించ లేక పోతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి కాచుకుని కూర్చుంది.

ఆ పార్టీ సహకారం ఉంటే తప్పనిసరిగా ఏపీలో తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది.కానీ పవన్ ప్రస్తుతం బిజెపి చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు.

దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మాత్రం పవన్ ను వదిలి పెట్టేందుకు ఏ మాత్రం ఇష్టపడకపోవడం టీడీపీ కి ఇబ్బందికరంగా మారింది.

#Alliance #Ysrcp #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు