రాజమండ్రిలో( Rajahmundry ) పొలిటికల్ హీట్ పెరుగుతోంది.వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
మొన్నటి వరకు డ్రగ్స్ కి డాన్ అంటూ ఇరు పార్టీలకు చెందిన యువ అభ్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా వీరిద్దరి మధ్య కరపత్రాల వివాదం చెలరేగింది.
ఎంపీ మార్గాని భరత్( MP Margani Bharat ) లంచగొండి అంటూ కొన్ని కరపత్రాలు ప్రత్యక్షం అయ్యాయని తెలుస్తోంది.అయితే వీటికి కారణం టీడీపీ అభ్యర్థి వాసునే( TDP Candidate Vasu ) కారణమని భరత్ ఆరోపించారు.
అదేవిధంగా కరపత్రాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మార్గాని భరత్ కోర్టులో పరువునష్టం దావా( Defamation Case ) వేస్తానని తెలిపారు.ఈ క్రమంలోనే కుటిల రాజకీయాలు మానుకోవాలని మార్గాని భరత్ సూచించారు.
మరోవైపు తాను కూడా న్యాయపోరాటం చేస్తానని టీడీపీ అభ్యర్థి వాసు వెల్లడించారు.గోల్డ్ స్మగ్లింగ్ లోనూ మార్గాని భరత్ కు ప్రమేయం ఉందని వాసు ఆరోపించారు.
వైసీపీ,టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది.