ఈ టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేకు ల‌క్ క‌లిసొచ్చిందే..!

సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.అయితే ఇవే వలసల వల్ల నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా అదే స్థాయిలో జరుగుతుంటుంది.

 Vasupalli Ganesh To Get Vizag South Seat, Vizag South, Ycp, Tdp Leaders Jump To-TeluguStop.com

గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకోవడం వల్ల పలు నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు నడిచింది.అసలైన టీడీపీ కార్యకర్తలు, అప్పుడే వచ్చిన వైసీపీ నాయకులకు పెద్దగా పడలేదు.

దీని వల్ల పార్టీకి బాగానే డ్యామేజ్ జరిగింది.
ఇక ఇప్పుడు అధికార వైసీపీలోకి టీడీపీ నేతలు వరుసగా జాయిన్ అవుతున్నారు.

అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు వచ్చారు.దీని వల్ల అసలైన వైసీపీ కార్యకర్తలకు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన కార్యకర్తలకు పడటం లేదు.

ప్రధానంగా కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యేల రాకని జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే గన్నవరం, చీరాల లాంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు నడుస్తుంది.

గన్నవరంలో ఎమ్మెల్సీ వంశీ, వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు-యార్లగడ్డ వెంకట్రావు వర్గాలకు బాగా గొడవలు జరుగుతున్నాయి.

ఇటు చీరాలలో సైతం కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గాలకు పొసగడం లేదు.

అయితే గుంటూరు వెస్ట్‌ వైసీపీలో పెద్ద కలయికలు ఉన్నట్లు కనిపించడం లేదు.ఇక ఇటీవల విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వచ్చారు.

దీంతో అక్కడ కూడా ఆధిపత్య పోరు నడుస్తుందని అంతా భావించారు.కానీ వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ హఠాన్మరణంతో, నియోజకవర్గంలో వైసీపీ కేడర్ వాసుపల్లికి మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

అదే సమయంలో ద్రోణంరాజు ఫ్యామిలీకి పార్టీ పరంగా న్యాయం చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది.దీంతో విశాఖ సౌత్‌ వైసీపీలో వాసుపల్లికి పెద్ద ఇబ్బంది ఉండదు.వచ్చే ఎన్నికల్లో సైతం వాసుపల్లికే సౌత్ సీట్ దక్కే ఛాన్స్ ఉంది.అలాగే ఇక్కడ ఆధిపత్య పోరు కూడా ఎక్కువగా ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube