జనసేన కావాల్సిందే ! నివేదికలతో సిద్ధమైన  తమ్ముళ్లు ? 

ఏదో అయితే కాని వివరం రాలేదు అన్నట్లుగా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు లబోదిబోమంటూ కొత్త పొత్తు పెట్టుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు.2019 ఎన్నికలలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది.దాని ఫలితం ఘోరంగా ఉండటంతో, బీజేపీతో పొత్తు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు, 2014 ఎన్నికలలో జనసేన, బిజెపి, టీడీపీ కూటమి కలిసి ఎన్నికలకు వెళ్ళాయి.ఆ ఫార్ములా వర్కవుట్ అయ్యింది.

 Tdp Trying To Alliance With Janasena Party , Janasena,tdp,ysrcp,pavan Kalyan, Ch-TeluguStop.com

కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి రెండు పార్టీలు దూరమయ్యాయి.ఎవరికి వారే అన్నట్టుగా విడివిడిగా పోటీ చేసి ముగ్గురు ఘోరంగా దెబ్బతిన్నారు.

ఇక ఆ తర్వాత జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి.ఆ కూటమిలోకి వెళ్లేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా, అవేమీ కలిసి రావడం లేదు.ప్రస్తుతం బిజెపి పై జనసేన ఆగ్రహంగా ఉండడం, ఆ పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ఉండడంతో, టిడిపి కన్ను జనసేన పై పడింది.జనసేన బలం ఏమిటనేది మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో స్పష్టంగా కనపడటం, కొన్నిచోట్ల జనసేన, టిడిపి కలిసి పొత్తు పెట్టుకోవడం, పొత్తు పెట్టుకున్న చోట విజయం నమోదవడం ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

టిడిపి, జనసేన అనధికారికంగా పొత్తు పెట్టుకున్న చోట్ల వచ్చిన ఫలితాలను , దానికి సంబంధించిన నివేదికలు ఇప్పుడు టిడిపి అధిష్టానానికి పంపిస్తున్న తమ్ముళ్ళు జనసేన తో పొత్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట.

Telugu Allince, Ap, Chandrababu, Janasena, Pavan Kalyan, Ysrcp-Telugu Political

ముఖ్యంగా గోదావరి జిల్లాలో వచ్చిన ఫలితాల రిపోర్ట్ తో ఎన్నికల ఫలితాలు మెరుగ్గా వస్తాయని, తప్పకుండా అధికారంలోకి వస్తామని అధినేతపై ఒత్తిడి చేస్తున్నారట.ఇదే విషయమై జనసేన పార్టీలోనూ చర్చ జరుగుతుండడంతో రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక పక్క జనసేన తోనూ, మరోవైపు బీజేపీతోనూ టీడీపీ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ఈ రెండు పార్టీ తోనూ పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పుడు జనసేన తో పొత్తు విషయమై తమ్ముళ్లు ఇచ్చిన నివేదికపై పార్టీ అధిష్టానం తీవ్రంగానే ఆలోచిస్తుండడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube