కలిసిపోదామా తమ్ముళ్లు ? జనసేన పై టీడీపీ కన్ను ? 

కలిసి ఉంటే కలదు సుఖమోయ్ అనే విషయాన్ని టీడీపీ జనసేన పార్టీలు గుర్తించినట్లుగా కనిపిస్తున్నాయి.2019 ఎన్నికలలో విడివిడిగా ఎన్నికలకు వెళ్లి రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ లభించింది.జనసేన,  బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఈ మధ్య జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో చాలా చోట్ల టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళింది.

 Tdp Try To Alliance On Janasena Janasena, Tdp, Ysrcp, Ap, Jagan, Chandrababu,el-TeluguStop.com

  ఫలితాలు సానుకూలంగా వచ్చాయి.దీంతో పాటు బీజేపీ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఏపీలో కంటే ముందు తెలంగాణలో బిజెపి నాయకులకు ఈ విషయం అర్థం అయ్యేలా సంకేతాలు ఇచ్చారు.ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి కాకుండా టిఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి పవన్ ఒక్కసారిగా బిజెపి కి షాక్ ఇచ్చారు.

పవన్ చర్యలతో బీజేపీ లో అలజడి మొదలైంది.  ఇక ఏపీలో పవన్ సహకారం తమకు అంతంతమాత్రంగా ఉంటుందనే విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తించారు.

ఇక చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిలో ప్రస్తుతం మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.ఎన్నిసార్లు ఎంతగా ప్రయత్నాలు చేసిన, బీజేపీ తమను కలుపుకు వెళ్లదు అనే విషయాన్ని గుర్తించిన బాబు జనసేన తో కలిసి వెళితేనే సునాయాసంగా అధికారం దక్కించుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించారు.

మరికొద్ది రోజుల్లోనే ఈ పొత్తుకు సంబంధించి ఒక కీలక సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారట.పొత్తు పెట్టుకుంటే జనసేన గెలిచే అవకాశం ఉన్న సీట్లతో పాటు మరికొన్ని అదనంగా ఇచ్చే విధంగా టీడీపీ ఒప్పుకుంటేనే పొత్తు కు వెళ్లాలని, లేకపోతే తటస్థంగా ఉండాలని జనసేన అభిప్రాయపడుతుండగా, ఏదో రకంగా జనసేన ను ఒప్పించి 2024 ఎన్నికల నాటికి తిరుగులేకుండా చేసుకోవాలని టిడిపి చూస్తోంది.

Telugu Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Somu Veerraju, Tirupathi, Ysr

అప్పుడు కనుక మళ్లీ ఎన్నికలలో ఒంటరిగా వెళ్లి ఓటమి పాలైతే, ఇక టీడీపీ నామరూపాల్లేకుండా అయిపోతుందని, లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఎదురవుతుంది అనే ఆలోచనలో ఉన్న బాబు జాగ్రత్తగా జనసేన తో పొత్తు వ్యవహారం డీల్ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారట.ఏదిఏమైనా మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీల పొత్తు వ్యవహారం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube