రావాలి పవన్ కావాలి పవన్ ! టీడీపీ లో కొత్త పల్లవి ? 

గత కొంత కాలంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.వైసీపీకి ప్రధాన రాజకీయ శత్రువుగా జనసేన పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 Tdp Try To Alliance On Janasena-TeluguStop.com

ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఆ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ విమర్శల దాడిలో టీడీపీ పక్కకు వెళ్ళిపోయింది.

వైసీపీ – టిడిపి మధ్య మాటల యుద్ధ కొనసాగుతున్న, జనసేన వైసిపి అంత స్థాయిలో మాత్రం ఈ విమర్శలు ఉండడం లేదు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎన్నికల్లో ప్రభావం కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తుండటం చంద్రబాబు మాట కూడా వినే పరిస్థితి ఆ పార్టీలో లేకపోవడం,  గతంతో పోలిస్తే టిడిపి బాగా బలహీనం కావడం ఇవన్నీ జనసేనకు బాగా కలిసి వస్తున్నాయి.

 Tdp Try To Alliance On Janasena-రావాలి పవన్ కావాలి పవన్ టీడీపీ లో కొత్త పల్లవి  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికారం దక్కించుకునేందుకు జనసేన మెల్లిమెల్లిగా పావులు కదుపుతూ వస్తోంది.

 బీజేపీతో ఆ పార్టీ  పొత్తు పెట్టుకున్నా అయిష్టంగానే ఆపొద్దు కొనసాగుతోంది ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది తెలంగాణ బిజెపి నాయకులు పవన్ అనేక సందర్భాలు అవమానించడం ఏపీలో బీజేపీతో పొత్తు రద్దు చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర అధికార పార్టీ సహకారం ఉంటే తమకు కలిసి వస్తుందని జనసేన అభిప్రాయపడడం తోనే అయిష్టంగానే కొనసాగుతున్నారు ప్రస్తుతం తిరుపతి లో బిజెపి అభ్యర్థి విజయం కోసం జనసేన కష్టపడుతోంది.

ఆమె గెలుపు కోసం పవన్ తిరుపతి లోనూ పర్యటించారు మరో సారి ఎన్నికల ప్రచారానికి పవన్ అని ప్రచారం ఊపందుకోవడంతో తెలుగుదేశం శరవేగంగా పావులు కదుపుతోంది పవన్ బీజేపీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం టిడిపి ఏమాత్రం ఇష్టపడడం లేదు.

Telugu Alliance, Bjp, Chandrababu, Jagan, Janasena, Pavan, Tdp, Ysrcp-Telugu Political News

అసలు ఏపీలో బీజేపీ ప్రభావం ఏమీ లేదని జనసేన సహకారంతోనే బిజెపి తిరుపతిలో ఈ స్థాయిలో ప్రభావం చూపించ జరుగుతోందని అదే పవన్ మరో సారి ఎన్నికల ప్రచారానికి దిగకపోతే మంచిదని టీడీపీ భావిస్తోంది.ఈ ఎన్నికల టెన్త్ జనసేన తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.గత కొద్ది నెలలుగా జనసేన తో పొత్తు పెట్టుకోవాలనే ఒత్తిడి పార్టీ నాయకుల నుంచి ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి గ్రామస్థాయి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని, వైసిపి బలం ముందు టిడిపి తేలిపోతుందని, అదే జనసేన సహకారం ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు అని ఒత్తిడి పెంచుతుండడంతో బాబు కూడా జనసేనతో పొత్తు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.

#Alliance #Jagan #Ysrcp #Janasena #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు