తిరుపతి ఖర్చు పై టీడీపీ ఆపసోపాలు ?

తిరుపతిలో త్రిముఖ పోటీ నెలకొంది.వైసిపి, బిజెపి, టిడిపి అభ్యర్థులు హోరాహోరీగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో గెలిచేందుకు పోరాటం చేస్తున్నాయి.

 Tdp Troubled On Tirupathi Elections Fund-TeluguStop.com

సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున హామీ ఇస్తూ, తిరుపతిలో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. జనసేన సహకారంతో తాము ఈ స్థానాలు గెలుచుకోగలము అని బిజెపి నమ్మకం తో ఉంది.

ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని బిజెపి ప్రచారం చేసుకుంటున్న , వైసీపీ ఇక్కడ బలంగా ఉంది.  తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా వైసీపీ  ప్రభావం ఉండటంతో, ఇక్కడ మెజార్టీ లెక్కలు వేసుకుంటోంది.

 Tdp Troubled On Tirupathi Elections Fund-తిరుపతి ఖర్చు పై టీడీపీ ఆపసోపాలు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టం అనే విషయం ఆ పార్టీ అగ్రనేతలు నుంచి  కార్యకర్తల వరకు తెలిసినా, పోటీ చేసి తీరాలనే పట్టుదలతోనే ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఓ విషయంలో టిడిపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 లోక్ సభ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు.ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.వైసిపి,  బీజేపీలకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు.ఎంత వరకు అయినా ఖర్చు పెట్టేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.

టిడిపి సైతం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా తిరుపతి సీటు గెలవలేము అనే అభిప్రాయంలో ఉండడం తో, ఇక్కడ ఖర్చుకు నిధుల సేకరణ చేసి, ఎన్నికల ఖర్చు పెట్టాలనే అభిప్రాయం చంద్రబాబు లో ఉంది.అందుకే ఈ బాధ్యతలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

దీంతో వీరు నిధుల సేకరణకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల నుంచి టిడిపి సానుభూతిపరులు , ఇలా అందరికీ ఫోన్లు చేస్తూ, నిధుల సేకరణకు దిగినట్లు సమాచారం.ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి ఆర్థికంగా తాను బలంగా లేనని, 2019 ఎన్నికల లోనే భారీగా సొమ్ము ఖర్చు పెట్టి, తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నాను అని, మళ్లీ ఈ ఎన్నికల్లో అంత సొమ్ములు ఖర్చు పెట్టలేని ముందుగానే చేతులు ఎత్తివేయడంతోనే,  బాబు నిధుల సేకరణకు ఈ ఏర్పాట్లు చేసారట.

ఇప్పుడు నిధుల సేకరణ  విషయంలోనే టీడీపీ ఎన్నో ఇబ్బందులు పదుతోందట.

టిడిపి గెలుపు పై ఎవరికి ఆశలు లేవు.ఇక్కడ పోటీ అంతా బీజేపీ, వైసీపీ మధ్య ఉంది అనే విషయం అందరికీ తెలుసు.అందుకే టీడీపీకి నిధులు సమకూర్చేందుకు బడా పారిశ్రామికవేత్తలు, టిడిపి సానుభూతిపరులు సైతం వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొందట.

పూర్తిస్థాయిలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో ఎన్నికల ప్రచారం విషయంలో పనబాక లక్ష్మి అంత యాక్టివ్ గా లేరు అనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.

#Lokesh #TDP Funds #Ysrcp #Elections #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు