టీడీపీ పై జగన్ ఎన్నికల అస్త్రం ? అదిరిపోయే స్కెచ్ !

జగన్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ ఎపుడూ అర్థం కావు.రాజకీయ పండితులు సైతం జగన్ పొలిటికల్ స్ట్రాటజీ చూసి అవాక్ అవ్వాల్సిందే.

 Tdp Troubled On Jagan Mind Game-TeluguStop.com

అసలు వైసీపీ ఏపీలో బలమైన పార్టీగా ఉన్నా, టీడీపీని ఢీకొట్టడడమే కాకుండా, కోలుకోలేని విధంగా ఆ పార్టీని దెబ్బ తీయడం వెనుక జగన్ రాజకీయ ఎత్తుగడలు బాగా పనిచేస్తాయి.ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.ఒకరకంగా చెప్పుకుంటే ఉనికి కోసం ఆ పార్టీ పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.2019 ఎన్నికల ఫలితాల తరువత టీడీపీ కాస్త కోలుకున్నట్టు గా కనిపించింది.ఫలితాలు ఘోరంగా వచ్చినా, టీడీపీ ప్రజా పోరాటాలు చేస్తూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించిన తీరు తో, కాస్త ఊపు వచ్చినట్టు కనిపించింది.అయితే ఇటీవల జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏమిటో పూర్తిగా అందరికీ అర్థమైపోయింది.
ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ కోలుకునే అవకాశం లేదు అనే సంకేతాలు వచ్చాయి.అసలు అప్పటి వరకు వైసిపి కూడా ఎన్నికలకు వెళ్ళాలంటే వెనకడుగు వేసినట్లు వ్యవహరించింది.

టీడీపీని పూర్తిగా ఏపీలో దెబ్బ కొట్టాలంటే ఎన్నికలకు వెళ్లడమే సరైన మార్గమని, ఎన్నికల లోపు వరుసగా టీడీపీకి ఎదురుదెబ్బలు తగిలితే, 2024 నాటికి పూర్తిగా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు.అందుకే వరుస వరుసగా ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ఇంతగా ఉత్సాహం చూపిస్తున్నారు.

 Tdp Troubled On Jagan Mind Game-టీడీపీ పై జగన్ ఎన్నికల అస్త్రం అదిరిపోయే స్కెచ్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం తిరుపతి లోక్ సభ  ఉప ఎన్నికలలో టీడీపీ సత్తా ఏమిటనేది అందరికీ ముందుగానే అర్థమైపోయింది.ఇక్కడ ప్రధాన పోటీ అంతా వైసీపీ , బీజేపీ మధ్య నెలకొన్న  పరిస్థితి ఉంది.

ఇక ఈ ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత మిగిలిపోయిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి.ఇక్కడ కూడా వైసిపి తన హవా చూపించబోతోంది.

ఇక ఆ తర్వాత  వైసీపీ ఎమ్మెల్యే వెంకట నరసయ్య మృతి చెందిన బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతాయి.

 అదే సమయంలో టిడిపికి రాజీనామా చేసి వైసిపి తో అనుబంధం గా కొనసాగుతున్న నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి , వైసీపీ తరఫున టికెట్ ఇచ్చి వారిని గెలిపించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.అలాగే విశాఖ కీలక నాయకుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అంటూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు .దీంతో ఆయన రాజీనామాను సైతం ఆమోదించి, అక్కడ ఉప ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఇలా వరుసగా ఎన్నికలకు వెళ్లి టీడీపీని దెబ్బకొట్టాలని, క్రమక్రమంగా టీడీపీ బలహీనం కావడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రద్దు అయ్యే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.ఎలా చూసుకున్నా 2024 నాటికి టీడీపీ ఏపీ లో కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు జగన్ ఈ ఎన్నికల అస్త్రాలను ఉపయోగిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

#Ycp Vs Tdp #Elections #YSJagan #Chandrababu #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు