కరోనా బారిన పడ్డ టీడీపీ కీలక నేత..!!

కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు.సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఒకటే అన్నట్టు తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది.

 Tdp Top Leader Affected By Corona-TeluguStop.com

తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు.ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

 Tdp Top Leader Affected By Corona-కరోనా బారిన పడ్డ టీడీపీ కీలక నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి.నెల రోజుల క్రితం 1000 లోపు కేసులు నమోదు కాగా ఇప్పుడు ఐదు వేలకు పైగా కొత్త కేసులు రోజు బయటపడుతున్నాయి.

ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు, కృష్ణ, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది.అదేవిధంగా పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో కూడా కోవిడ్ కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి.

వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు కరోనా బారిన పడుతున్న పరిస్థితి.దీంతో ప్రతి శుక్రవారం సెక్రటేరియట్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

#Kesineni Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు