మొన్న టీడీపీ.. నిన్న వైసీపీ.. రేపు మ‌ళ్లీ టీడీపీలోకే... ఇద్ద‌రు మాజీల పిల్లి మొగ్గ‌లు ?  

రాజ‌కీయాల్లో కావాల్సింద‌ల్లా అధికారం.ప‌ద‌వులు ఇవి ఎక్క‌డ ఉంటే చాలా మంది నేత‌లు అక్క‌డే ఉంటారు.

TeluguStop.com - Tdp Tomorrow Ycp Yesterday Tdp Again Tomorrow Two Former Cat Buds

పార్టీ  అధికారంలో ఉన్నా ప‌ద‌వి లేక‌పోతే ఉప‌యోగం ఏం ఉంటుంది.ప్ర‌స్తుతం వైసీపీలో చాలా మంది నేత‌లు ప‌ద‌వులు లేక‌.

గుర్తింపు లేక ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.అంతెందుకు గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్ల‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని .కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని హామీ ఇచ్చినా కూడా ఆయ‌న‌కు చివ‌ర‌కు ఎమ్మెల్సీయే దిక్కులేదు.ఇక జ‌గ‌న్ నుంచి హామీ పొంది ప‌ద‌వులు రాక త‌మ బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క‌.

TeluguStop.com - మొన్న టీడీపీ.. నిన్న వైసీపీ.. రేపు మ‌ళ్లీ టీడీపీలోకే… ఇద్ద‌రు మాజీల పిల్లి మొగ్గ‌లు -Political-Telugu Tollywood Photo Image

బ‌య‌ట‌కు వెళ్ల‌లేక ర‌గులుతున్న నేత‌లు చాల మందే ఉన్నారు.

తాజాగా ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో ప్రాధాన్యం లేక లోలోన ర‌గులుతోన్న ప‌రిస్థితే ఉంది.

వీరిలో ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం మాజీ ఎమ్మెల్యే పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్ రెడ్డి ఉన్నార‌ని తెలుస్తోంది.డేవిడ్ రాజు గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ త‌ర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌లో ప‌డి బాబు చెంత చేరారు.గ‌త ఎన్నిక‌ల్లో బాబు సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో తిరిగి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.ఇప్పుడు అస్స‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు క‌టాక్షం కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.

ఇటీవ‌ల ఒంగోలులో త‌న ఇంట్లో స‌మావేశం అయిన ఆయ‌న చంద్ర‌బాబు ఒప్పుకుంటే పార్టీలో చేరి య‌ర్ర‌గొండ‌పాలెం బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు రెడీగా ఉన్నాన‌ని సంకేతాలు పంపారు.ఇక క‌ర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్ రెడ్డి కూడా వైసీపీలో ఇమ‌డ‌లేని ప‌రిస్థితి.ఆయ‌న అన‌వ‌స‌రంగా పార్టీ మారానా ? అని బాధ‌ప‌డుతున్నారు.బాబు సీటు ఇవ్వ‌లేద‌ని ఎన్నిక‌ల వేళ తిరిగి వైసీపీలో చేరినా ఇప్పుడు ఆయ‌న‌కు ప‌ద‌వి లేదు… ప్ర‌యార్టీ లేదు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌య‌ట‌కు రావాల‌న్నా ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదు.

క‌ర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా టీజీ భ‌ర‌త్ ఉన్నారు.ఆయ‌న్ను కాద‌నే ప‌రిస్థితి లేదు.దీంతో మోహ‌న్ రెడ్డి కూడా కాలం క‌లిసొస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.ఇక ఈ లిస్టులోనే చాలా మంది నేత‌లు ఉన్న‌ట్టు టాక్ ?

.

#Political War #Sv Mohan Reddy #Ysrcp #Kurnool #David Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు