మావయ్య ఇంత దెబ్బ కొడతాడని టీడీపీ ఊహించలేదుగా ?

జగన్ మావయ్య సీఎం అయిన తర్వాత చాలా పథకాలనే ప్రవేశపెట్టారు.”నేను భవిష్యత్తులో కలెక్టర్ కావాలని అనుకుంటున్నాను.నేను సీఎంగా జగన్ ఉండాలని కోరుకుంటున్నాను.జగన్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఓ హై స్కూల్ విద్యార్థి మాట్లాడింది.తాను మూడో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను అని, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చేరానని, జగనన్న విద్యా కానుక ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఓ విద్యార్థిని పేర్కొంది.అసలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లను పంపిణీ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టడం, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లను పంపిణీ చేయడం, పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసి, జగనన్న విద్య కానుకను ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

 Jagan, Ysrcp, Ap Tdp, Jagananna Vidhya Kanuka ,chandrababu , Ap Students-TeluguStop.com

సుమారు 650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు.త్వరలోనే స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ముందుగానే వీటిని అందిస్తున్నారు.ప్రతి విద్యార్థికి స్కూల్ కి వెళ్లి చదువుకునేందుకు వీలుగా, మూడు జతల బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగు, పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు అవసరమైన అన్నిటినీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో, మరోసారి జగన్ సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.అసలు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలు తీర్చిదిద్దడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాల చూపు ఇక్కడ పడింది.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Jagan, Jaganannavidhya, Ysjagan, Ysrcp-Telugu Po

ఏపీని రోల్ మోడల్ గా తీసుకునేందుకు సిద్దమవుతుండటం వంటి వ్యవహారాలు టిడిపిలో కలవరం పుట్టిస్తున్నాయి.జగన్ ను ఏదో రకంగా అభాసుపాలు చేద్దామని చూస్తున్న తరుణంలో ఇప్పుడు పాఠశాల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జగన్ తన బుట్టలో వేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా జగన్ చేయడంతో, ఆ క్రెడిట్ కు టిడిపి విలవిల్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది.అందుకే గతంలో తాము కూడా, ఈ తరహా కిట్లను అందించామని, సైకిళ్ళు అందించామని, చెప్పుకునే ప్రయత్నం టిడిపి మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది.పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై పార్టీలకు అతీతంగా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో పిల్లల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని వైసీపీ చెబుతోంది.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Jagan, Jaganannavidhya, Ysjagan, Ysrcp-Telugu Po

ఈ పరిణామాలు ఇప్పుడు టిడిపికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.అసలు ఈ వైసిపికి క్రెడిట్ దక్కకుండా చేద్దామని చూస్తున్న సమయంలో, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న భయంతో టిడిపి వెనక్కి తగ్గుతోందట.ఈ జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో జగన్ ప్రారంభించారు.తరగతి గదిలోని బల్లపై విద్యార్థుల పక్కన కూర్చుని జగన్ మాట్లాడడం, స్కూల్ బ్యాగ్ తగిలించుకుని సరదాగా గడపడం, ఇవన్నీ జగన్ కు ఎక్కడలేని క్రేజ్ ను తెచ్చి పెట్టాయి.

ప్రస్తుతం ఈ క్రెడిట్ జగన్ కు బాగా పెరిగిపోవడంతో, ఈ పథకంలోని లోపాలను వెతికి గుర్తించే పనిలో టిడిపి నిమగ్నం అయిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube