టీడీపీ లో ఆ భయం మొదలయ్యింది .. వైసీపీలో జోష్ పెరిగింది  

Tdp Tension Over Jumping Mlas Into Ycp-

ఏపీలో రోజు రోజుకి టీడీపీ పరిస్థితి దిగజారుతున్నట్టు కనిపిస్తోంది.పైకి అంతా బాగానే ఉందని కవరింగ్ ఇస్తున్నా .లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటివరకు జగన్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇక మళ్ళీ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడించడం ఖాయం అని ఆ పార్టీ నేతలు భవిస్తూ వచ్చారు.అయితే కొద్ది రోజులుగా వైసీపీ బలం బాగా పెరిగింది..

Tdp Tension Over Jumping Mlas Into Ycp--TDP Tension Over Jumping MLAs Into YCP-

ఈ విషయం టీడీపీ నిర్వహించిన అనేక సర్వేల్లో కూడా తేలిందట.ప్రస్తుతం టీడీపీ అధికారం లో ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్లేందుకు నాయకులు వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు.కానీ సమయం అనుకూలిస్తే వైసీపీలోకి వలస వచ్చేందుకు చాలామంది నేతలు క్యూ కట్టేందుకు సిద్ధం అయినట్టు సమాచారం.

టీడీపీకి ప్రధానంగా మీడియా బలం ఎక్కువగా ఉంది.ప్రభుత్వం మీద ఎంత నెగిటివ్ ఉన్నా అదేమీ కనిపించకుండా కేవలం పాజిటివ్ న్యూస్ ప్రచారంలోకి తీసుకొచ్చి కాపాడుతున్నారు.అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాగా బలం పుంజుకోవడంతో వాస్తవం ఏంటి అనేది అందరూ గ్రహించేస్తున్నారు.ఆ పార్టీతో నాలుగేళ్ళుగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో వలసలు మొదలయ్యాయాన్న టాక్ వినిపిస్తోంది.

ఆనం ని చేర్చుకున్న తరువాత జగన్ మాట్లాడుతూ ఇకపై సైకిల్ దిగే వారే తప్ప ఎక్కేవారు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు..

టీడీపీ విధానాలు ప్రస్తుతం ఆ పార్టీ నాయకులకే నచ్చడంలేదని, చంద్రబాబు పచ్చి అవకాశవాదని అందుకే ఆ పార్ట్ నాయకులు తమ పార్టీలోకి వలస వచ్చేందుకు చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నాడు.ఇప్పటికే పలు జిల్లాల్లో అసంతృప్తి నాయకులతో సైకిల్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.మరో వైపు ప్రజా వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది.

ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి.ఈ టైంలో ఆనం చేరికతో రివర్స్ వలసలకు తెర తీసారని అంటున్నారు.ఇదే బాటలో చాలా మంది వైసీపీ శిబిరం వైపుగా రావచ్చునని ప్రచారం జోరుగా సాగుతోంది..