ఎన్టీఆర్ ను ఇలా సైడ్ చేస్తున్నారా ?  భవిష్యత్ భయమా ?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం పై పరోక్షంగా వైసిపి నాయకులు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం పెద్దగానే రేగింది.ఈ వ్యవహారంలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ సంచలనంగా మారాయి.

 Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap, Juniour Ntr, Young Tiger, Nandamuri, Varla R-TeluguStop.com

  ఇక ఆ తర్వాత చంద్రబాబుకు నందమూరి కుటుంబం నుంచి ,  వివిధ రాజకీయ వర్గాలు,  ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుభూతి లభించింది.నందమూరి కుటుంబ సభ్యులంతా వీడియో ద్వారా తమ  మద్దతును చంద్రబాబుకు తెలియజేశారు.

ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు.  అసెంబ్లీలో జరిగిన సంఘటన చాలా బాధించిందని మాట్లాడుతూ.

  ఆడవారిపై ఈ తరహా విమర్శలు ఏమాత్రం మంచిది కాదంటూ ఎన్టీఆర్ మాట్లాడారు.

  అయితే ఎక్కడ తన మాటల్లో చంద్రబాబు భువనేశ్వరి ల పేర్లు కానీ, వైసిపి, ఆ పార్టీ నాయకుల పేర్లు కానీ ప్రస్తావించకుండా జూనియర్ ఎన్టీఆర్ చాలా బ్యాలెన్స్ గా మాట్లాడారు.

ఇక ఇక్కడితో ఈ సంగతి ముగిసింది అనుకున్నప్పటికీ,  టిడిపి నేతలు జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం పై పెదవి విరిచారు.ఆయన ఆది, సింహాద్రిలా వైసీపీ పై విరుచుకు పడతాడు అనుకుంటే, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వినిపించారని , విమర్శలు చేశారు.

ఇక టిడిపి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరింతగా జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరి పై కొడాలి నాని,  వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని, భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

Telugu Chandrababu, Jagan, Ntr, Nandamuri, Varla Ramayya, Young Tiger, Ysrcp-Tel

సినిమాల కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకుంటారా అని ఎన్టీఆర్ ను ఉద్దేశించి వర్ల రామయ్య విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలు పెద్ద కలకలం సృష్టించాయి.టిడిపి అగ్రనేతల అనుమతి లేకుండా వర్ల రామయ్య ఈ తరహా విమర్శలు నందమూరి వారసుడు పై చేసే అవకాశమే లేదు.

దీని వెనుక చాలా వ్యూహం ఉన్నట్లుగా అర్థం అవుతోంది.  ఎన్టీఆర్ కు నందమూరి , టిడిపి కి ఇకపై సంబంధాలు లేవు అన్నట్లుగా వర్ల రామయ్య మాటలను బట్టి అర్థమవుతోంది.

టిడిపి నాయకులు ఎన్టీఆర్ ను ఈ విధంగా  చేసుకోవడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.చంద్రబాబు వయసు రీత్యా మరెంతోకాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడం,  టిడిపిని నారా లోకేష్ ఒక్కరే నడిపించే అంతటి శక్తి సామర్ధ్యాలు లేకపోవడం వంటి కారణాలతో పార్టీ కేడర్ ను జూనియర్ ఎన్టీఆర్ టిడిపి లో యాక్టివ్ కావాలని పార్టీ బాధ్యతలు మొత్తం ఆయన తీసుకోవాలనే  డిమాండ్ పెరుగుతూ వస్తోంది.

అంతే కాదు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ గట్టిగా వినిపించింది.ఇక అనేక సందర్భాల్లో జూనియర్ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తుండడం చంద్రబాబుకు,  లోకేష్ కు ఇబ్బందికరంగా మారింది.

వైసిపి నాయకులు తమ కుటుంబం పై చేసిన వ్యక్తిగత విమర్శలను జూనియర్ ఎన్టీఆర్ కు ముడిపెట్టి పూర్తిగా టిడిపి కి ఎన్టీఆర్ కు సంబంధం లేదు అనే సంకేతాలను ఈ విధంగా తెలియజేసినట్లు గా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube