ఆ ఒక్క మంత్రే టీడీపీ టార్గెట్ ? జగన్ ఇరుకునపడ్డట్టే ?

అన్ని విషయాల్లోనూ జగన్ పైచేయి సాధిస్తూ ఏపీ లో దూసుకుపోతుండడం, ప్రజల్లో మరింత బలం పెంచుకునే విధంగా రకరకాల పథకాలను ప్రవేశపెడుతూ, మరింతగా బలపడిపోతుండడం వంటి వ్యవహారాలు అన్నీ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి.ఏదో రకంగా జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసి, పై చేయి సాధించాలనే పట్టుదలతో టీడీపీ ఉంది.

 Tdp Target On Ap Minister Gummanuri Jayaram Gummanuri Jayaram Minister, Ap ,jag-TeluguStop.com

దీనికి తోడు పెద్దఎత్తున నాయకులు వైసీపీ బాట పడుతుండడం వంటి వ్యవహారాలతో ఏదో ఒక రకంగా ఆ పార్టీపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే విధంగా చేయాలనే ధ్యేయంతో టిడిపి ఇప్పుడు అడుగులు వేస్తోంది.అందుకే వైసీపీ నాయకుల అవినీతి వ్యవహారాలను ప్రజల ముందు పెట్టాలని ఇప్పుడు కసరత్తు చేస్తోంది.

అలాగే జగన్ మంత్రి మండలిలో అవినీతిపరులు ఉన్నారనే విషయాన్ని రుజువు చేసేందుకు నానా తంటాలు పడుతోంది.

కనీసం ఒకరిద్దరు మంత్రులను జగన్ క్యాబినెట్ నుంచి తప్పించే విధంగా తాము చేయగలిగితే, వైసీపీ ప్రభుత్వంపై పైచేయి సాధించగలమని, పార్టీ నాయకుల్లోనూ తెలుగుదేశం పార్టీపై నమ్మకం మరింతగా పెరుగుతుందనే విషయాన్ని టీడీపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ, టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తోంది.ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం టిడిపి సీనియర్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పర్యవేక్షిస్తున్నారు.

జయరామ్ కుమారుడు బెంజ్ కారు వ్యవహారంపైన మొన్నటి వరకు ఆయన విమర్శలు చేసి కొంత మేర విజయం సాధించారు.

Telugu Benzcar, Chandrababu, Jagan, Ysjagan, Ysrcp-Telugu Political News

తాజాగా కర్నూలులో చోటుచేసుకున్న భూ వివాదంలో మంత్రి పాత్ర ఉండడాన్ని ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు.జయరాం మంత్రి అయిన తర్వాత భూదందాకు పాల్పడ్డారనే ఆరోపణలు చేస్తూ, అల్లరి అల్లరి చేస్తున్నారు.ఈ వ్యవహారంలో మంత్రి తన తప్పేమీ లేదని గట్టిగానే చెప్పుకుంటున్నా, చాలా వరకు వైసీపీ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయిందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఈ విధంగా మరి కొన్ని ఆధారాలను సేకరించి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని టీడీపీ భావిస్తోంది.ఇలా చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన క్రెడిట్ మొత్తం పోతుందనీ, ఫలితంగా టిడిపికి ఆదరణ పెరుగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది.

కేవలం ఒక మంత్రితో సరిపెట్టకుండా, అందరి మంత్రులు, పార్టీ నేతలపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube