ఈ సమయంలో ఆ సాహసం అవసరమా ? తప్పడం లేదా ?

వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు లేరు.రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలను ను రూపొందిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

 Andhra Pradesh, Telangana, Tdp, Chandrababu Naidu, L. Ramana, Trs, Congress, Bjp-TeluguStop.com

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతోంది.

అయినా అధికార పార్టీకి ధీటుగా రాజకీయాలు చేయడంలో ఎప్పుడు పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తూనే వస్తోంది.ఇక తెలంగాణలో టిడిపి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏపీ తెలంగాణ విభజన జరిగిన దగ్గర నుంచి ఉనికి కోసం పోరాడుతూనే ఉంది.బలమైన పార్టీగా, అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ ను ఎదుర్కోవడం తెలంగాణ టిడిపి నాయకుల వల్ల కాకపోవడం, ఇప్పటికే అక్కడ కీలక నాయకులుగా ఉన్న వారంతా అధికార పార్టీలో చేరిపోవడంతో ఉనికి కోసం అక్కడ టిడిపి పోరాడుతోంది.

2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి టిడిపి మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లినా, అక్కడ చేదు ఫలితాలు ఎదురయ్యాయి.కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సీట్లు సంపాదించుకున్నా, గెలిచిన వారిలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.

దీంతో ఆ పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది .అది కాకుండా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ తో కలిసి అక్కడి టిడిపి ముందుకు నడుస్తుండడం పై పార్టీ కేడర్ లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది.తెలంగాణ కాంగ్రెస్ తో కలిసి తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి పోరాటం చేస్తోంది.

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు.

అయితే టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Congress, Ramana, Telangana-Latest News - Te

గతంలో మోదీని, ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాబు ఇప్పుడు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ని పొగుడుతూ, ప్రధానిని ప్రశంసిస్తూ వస్తున్నారు.2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి అడుగులు ముందుకు వేయాలన్నది చంద్రబాబు ప్లాన్.అయితే బీజేపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో తెలంగాణ టిడిపి జతకట్టడం మొత్తం ఆ పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఒక వైపు బిజెపి కి దగ్గరగా అడుగులు వేస్తూ , మరోవైపు ఆ పార్టీ వ్యతిరేక పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం బాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనం అంటూ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని కాంగ్రెస్ తో టీడీపీ కలిసి అడుగులు ముందుకు వేయడం వ్యూహాత్మక తప్పిదం గానే పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.అయితే ఈ విషయంలో బాబు లెక్కలు బాబుకు ఉన్నాయన్నది తెలుగు తమ్ముళ్ల వాదన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube