చివ‌రికి టీడీపీ ప‌రిస్థితి ఈ చోటాల చేతిలో చిక్కిపోయింది..!  

atlast,finally TDP stuck in these hands,shaik mohammed nazeer,pilli manikya rao,chandra babu,kodali nani,jagan mohan reddy,vasupalli ganesh - Telugu Chandra Babu, Hands, Jagan Mohan Reddy, Kodali Nani, Pilli Manikya Rao, Shaik Mohammed Nazeer, Vasupalli Ganesh

షేక్ మ‌హ‌మ్మ‌ద్ న‌జీర్.ఈ పేరు ఎప్పుడైనా విన్నారా?  పోనీ.పిల్లి మాణిక్యాల‌రావు.ఈయ‌నైనా ఎవ‌రికైనా తెలుసా?  ఇలాంటి నాయ‌కులు చాలా మందే ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.మ‌రి వీరు ఎవ‌రు?  ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? అనే ప్ర‌శ్న వ‌స్తే.దీనికి స‌మాధానం.టీడీపీ! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.

TeluguStop.com - Tdp Situation Worse Ap Politics Ycp Govt

వీరు టీడీపీలో కార్య‌ద‌ర్శులుగా ఉన్నారు.నిజానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు మాత్ర‌మే అంతో ఇంతో గుర్తింపు ఉంటుంది.

అది కూడా చాలా క‌ష్ట‌మే.అలాంటిది కార్య‌ద‌ర్శులుగా ఉన్న సాధార‌ణ చోటా నేత‌లు ఇలా ఒక్క‌సారి బూమ్ రావ‌డం ఏంటి?

TeluguStop.com - చివ‌రికి టీడీపీ ప‌రిస్థితి ఈ చోటాల చేతిలో చిక్కిపోయింది..-Political-Telugu Tollywood Photo Image

ఇక్క‌డే ఉంది అస‌లు మ‌జాకా.అంతా! నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు చోటా నేత‌లుగా ఉన్న‌వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.స్థానిక ఎమ్మెల్యే వారిని అవ‌సరాన్ని బ‌ట్టి వాడుకునేవారు.జెండాలు మోయించేవారు.ప్ర‌చారానికి పిలిచేవారు.అంతే! కానీ, ఎప్పుడూ పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే రేంజ్ వారికి ఇవ్వ‌లేదు.వారు కూడా ఎప్పుడూ మీడియా ముందుకు రావ‌డం, రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేయ‌డం.అనే సాహ‌సాల‌కు దిగింది కూడాలేదు.అయితే, ఇప్పుడు టీడీపీకి ఇలాంటి వారే   దేవుళ్లు.

రాముళ్లు .అయిపోయారు.ఇదేదో స‌ర‌దాకి చెబుతున్న మాట కాదు.చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాకు `వారిని లేపండి.` అంటూ చేసిన సిఫార‌సు చేశార‌ట‌.

అంతే! ఇంకేముంది.అస‌లు రాష్ట్రంలో ఆ నాయ‌కుడి పేరు కూడా ప‌ట్టుమ‌ని ప‌దిమందికి తెలియ‌ని న‌జీర్‌.జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ చేశారు.

విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ రెండు రోజుల కింద‌ట టీడీపీని వీడి(అధికారికంగా వీడ‌లేదు).వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు.

అయితే, ఆయ‌న అలా పార్టీ మార‌డం వెనుక జ‌గ‌న్‌దాదాపు వంద కోట్లు ఇచ్చార‌ని.న‌జీర్ అనే ఓ నాయ‌కుడు(?) ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు సంచ‌ల‌నం కాదు.ఆయ‌నెవ‌రోకూడా ప్ర‌జ‌లు తెలియ‌ని ప‌రిస్థితిలో ఇంత ఆరోప‌ణ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక‌, మంత్రి కొడాలి నానిని గ‌జ్జికుక్క‌తో పోలుస్తూ.పిల్లి మాణిక్యం అనే మ‌రో నేత‌(?) కూడా వ్యాఖ్య‌లు సంధించారు.దీనికి బాబు అనుకూల మీడియా భారీ బాజా మోగించింది.నాయ‌కుల విమ‌ర్శ‌లు కొత్త‌కాదు.కానీ, ఇలా చోటా నేత‌లు కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం, వాటికి బాబు క‌వ‌రేజ్ ఇవ్వ‌మ‌ని సిఫార‌సులు చేయ‌డ‌మే అస‌లు రాజ‌కీయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

#Chandra Babu #Hands #Kodali Nani #ShaikMohammed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Situation Worse Ap Politics Ycp Govt Related Telugu News,Photos/Pics,Images..