ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన టీడీపీ కీలక నేత..!!

Tdp Sensatational Leader Comments On Ntr

టీడీపీ కీలక నాయకుడు వర్ల రామయ్య ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.విషయంలోకి వెళితే ఇటీవల మీడియా సమావేశంలో చంద్రబాబు తన భార్యని వైసీపీ నాయకులు పరుష పదజాలంతో విమర్శించినట్లు.ఆరోపణలు చేసి దాదాపు రెండు నిమిషాల పాటు బోరున కన్నీటిపర్యంతమయ్యారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏడవటం తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాక జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపింది.మొన్నటి వరకు ఏపీ రాజకీయాలు చంద్రబాబు ఏడవటం చుట్టూ తిరిగాయి.ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు.చంద్రబాబు ఏడవటం పట్ల దానికి గల కారణాల పట్ల.తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడం జరిగింది.

 Tdp Sensatational Leader Comments On Ntr-TeluguStop.com

ఇదిలా ఉంటే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించి,ఖండించడం జరిగింది.కాగా తాజాగా.

టీడీపీ కీలక నాయకుడు వర్ల రామయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎన్టీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

 Tdp Sensatational Leader Comments On Ntr-ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన టీడీపీ కీలక నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విషయంలోకి వెళితే తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన వర్ల రామయ్య.

వైసీపీ నాయకులు చంద్రబాబు భార్య భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ చంద్రబాబుకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో భువనేశ్వరిపై వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరుకు ఎన్టీఆర్ స్పందించిన తీరు అస్సలు బాగోలేదు అని అన్నారు.

మేనత్త పై ఇష్టానుసారంగా వైసిపి నాయకులు కామెంట్ చేస్తే ఎన్టీఆర్ రియాక్ట్ అయిన విధానం సరిగ్గా లేదని పేర్కొన్నారు.

Telugu Assembly, Bhuvaneshwari, Chandra Bbau, Comment On Ntr, Ntr, Tdp, Tollywood, Varla Ramaiah-Telugu Political News

తన సినిమా కెరీర్ కోసం నందమూరి కుటుంబాన్ని నైతిక విలువలను ఎన్టీఆర్ వదులు కుంటున్నారా.అంటూ సంచలన ప్రశ్నలు లేవనెత్తారు.సినిమా కెరీర్‌లో ఉన్న వారికి అమ్మ, అక్క, చెల్లి, మేన‌త్త‌, బావ‌, వ‌దిన‌ అనే వారు అక్క‌ర్లేదా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.జూనియ‌ర్ ఎన్టీఆర్ 75 ఏళ్ల ముస‌లివాడిలా నీతులు చెబుతున్నార‌ని వర్ల రామయ్య వెటకారం అయిన కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు చూస్తే కేవలం సినిమా కెరియర్ బట్టి స్పందించినట్లు ఉంది.

సొంత మేనత్త పై దారుణమైన కామెంట్లు చేస్తే ఈ విధంగా ఎన్టీఆర్ స్పందించటం దురదృష్టకరం అన్న తరహాలో వర్ల రామయ్య విమర్శల వర్షం కురిపించారు.

#Chandra Bbau #Varla Ramaiah #Bhuvaneshwari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube