బుచ్చయ్య ఒక్కరికే కాదు ! వీరంతా  ?

తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ లో సీనియర్.అయితే, పార్టీలో తన స్థాయికి తగ్గ గౌరవ మర్యాదలు దక్కడం లేదు.

 Most Of The Tdp Senior Leaders Are Not Happy With The Situation In Tdp, Gorantla-TeluguStop.com

కనీసం మొదటి నుంచి తన గురించి తెలిసిననా, చంద్రబాబుకు తాను ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని , తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనే అసంతృప్తితో ఆయన ఉంటూ మొన్న కాక రేపారు.లోకేష్ వ్యవహారశైలి పైన విమర్శలు చేశారు .నాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో లోకేష్ సీనియర్లతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.అంతే కాదు పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బుచ్చయ్య బాంబ్ పేల్చారు.

ఆయనను బుజ్జగించడానికి చంద్రబాబు పార్టీ నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారు.కాస్తో కూస్తో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీలో ఇప్పుడు బుచ్చయ్య బాటలో నడిచేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు.

 ఇదే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఏపీ లోని అన్ని పార్టీల్లోనూ చేరారు వైసీపీ నుంచి ఇప్పుడు టిడిపిలోకి వెళ్లారు వల్లే వైసీపీ లోకి వచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.ఇటీవల ఆయన అనారోగ్యానికి గురి కాగా వైసీపీకి చెందిన మంత్రి కురసాల కన్నబాబు ఆస్పత్రుల్లో పరామర్శించారు.

అలాగే జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలంతా ఆయనను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.కాపు సామాజికవర్గంలో ఆయనకున్న రాజకీయ అనుభవం  ఆయనకు ఈ స్థాయిలో గౌరవం దక్కుతుది .

Telugu Jagan, Rajamundryrural, Sujayakrishna, Ysrcp-Telugu Political News

అయితే గత కొంతకాలంగా ఆయన టిడిపిలో ఇమాడ లేకపోవడంతో పాటు, లోకేష్ చంద్రబాబు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత ఆయన రాజకీయ భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇక ఎప్పటికీ ఇదే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సైతం అసంతృప్తితోనే ఉన్నా,  ఆయన పార్టీ వీడే సాహసం  అయితే చేయడం లేదు.

Telugu Jagan, Rajamundryrural, Sujayakrishna, Ysrcp-Telugu Political News

అలాగే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సైతం తీవ్ర అసంతృప్తి గానే ఉన్నారట.ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం టిడిపిలో కొనసాగేందుకు అంతగా ఇష్టపడడం లేదట.రాజకీయంగా రాయపాటి యాక్టివ్ గా తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఆయన కుమారుడు రంగారావుకు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం టికెట్ కేటాయించాలని కోరుతూ తిరుగుతున్నా,  చంద్రబాబు మాత్రం స్పందించడం లేదట.దీంతో ఆయన రాజకీయ నిర్ణయం తీసుకునే  ఆలోచనలో ఉన్నారట.

ఇలా ఎక్కడ చూసినా టిడిపిలో అసంతృప్తి నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు.ఇది  ఆ పార్టీ పరిస్థితి అర్థం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube