కేఈ టీడీపీని వీడబోతున్నారా ? జగన్ ఆ హామీ ఇచ్చారా ?  

Tdp Seniour Leader Ke Krishna Murthi Join To Intrest Ysrcp-

పార్టీకి చెందిన వారంతా వరుస వరుసగా జంపింగులు చేస్తుండడంతో చంద్రబాబులో ఆందోళన కనిపిస్తోంది.నాయకుల వలసలతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కుదేలైంది.కృష్ణా జిల్లా నేతలు ఇద్దరు ఇప్పటికే పార్టీని వీడిపోగా మరికొందరు పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.అలాగే పార్టీ మారే వారంతా వెళ్తూ వెళ్తూ టిడిపిపైన తన పైన ఆరోపణలు చేస్తూ వెళ్ళడం చంద్రబాబుకు అసహనాన్ని కలిగిస్తోంది.

Tdp Seniour Leader Ke Krishna Murthi Join To Intrest Ysrcp- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Tdp Seniour Leader Ke Krishna Murthi Join To Intrest Ysrcp--Tdp Seniour Leader Ke Krishna Murthi Join To Intrest Ysrcp-

పార్టీ మారే వారి లిస్టులో ఇప్పటికే కృష్ణా జిల్లా నేతలు బొండా ఉమా, బోడె ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఉపముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడైన కేఈ కృష్ణమూర్తి వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఈ మేరకు వైసీపీలోకి వెళ్లేందుకు ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది వైసీపీలకి మొత్తం కేఈ కుటుంబం అంతా వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.కేఈ కృష్ణమూర్తి తో పాటు ఆయన సోదరుడు ప్రభాకర్ కూడా వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే మంతనాలు చేసినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు జగన్ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.అంతేకాకుండా కృష్ణమూర్తి పార్టీలో వస్తే ఆయనకు సముచిత స్థానం ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.