బలం ఉన్న చోటే సీట్లు - ఫార్ములా వర్కౌట్ అవుతుందా??

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు( Chandrababu Naidu ) నాయకత్వం కిందకి వచ్చినప్పటి నుంచి పొత్తు రాజకీయాలతోనే ముందుకు వెళుతుంది .ప్రతి ఎన్నికకు ఒక కొత్త మిత్రుడిని చేర్చుకొని అనేక సమీకణా లు లెక్కలేసుకుని మరి రాజకీయం చేయడం ఆ పార్టీ అదినేత కు అలవాటే.

 Tdp Seniors Unhappy With Janasena Alliance Details, Tdp Seniors, Chandrababu Nai-TeluguStop.com

అయితే పొత్తుల విషయంలో ఏనాడూ ఎదురుకొని కఠిన పరిస్థితిని ఈ ఎన్నికలలో ఆ పార్టీ ఎదుర్కొంటుంది.యువతలోనూ కొన్ని సామాజిక వర్గాలలోను బలంగా ఉన్న జనసేన పార్టీని( Janasena ) పొత్తులో భాగంగా కలుపుకోవాలని కలసి రాజకీయం గా ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల అధినేతలు ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు .

ప్రతిపక్షాల పట్ల ప్రతీకార రాజకీయాలకు తేర తీసిన జగన్ ( CM Jagan ) రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవాలంటే పొత్తు తప్పనిసరి అని భావించిన రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని కోరుకున్నారు అయితే పొత్తులు అంత సాఫీగా సాగవని జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు సహజంగా మిత్రులకు తాము బలంగా లేని చోట కట్టబెట్టి తాను గరిష్ట లాభం పొందే విధంగా చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటారు .అయితే ఈసారి చంద్రబాబు వ్యూహాలు సాగవని తమకు బలం ఉన్నచోట్లే తాము సీట్లుకోరుకుంటామని పోటీ చేస్తామంటూ జనసేన గట్టిగానే సౌండ్ చేస్తుంది.ఆ దిశగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పటికే బహిరంగ వేదికలపై తమ బలం న్ని ఏ ఏ ప్లేస్ లో ఉందో కూడా చెప్పుకొచ్చారు

Telugu Alapatirajendra, Ap, Chandrababu, Jagan, Janasenatdp, Pawan Kalyan, Tdp S

అయితే అదే ఇప్పుడు టిడిపి సీనియర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట.పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న చోట ఎక్కడ త్యాగం చేయాల్సి వస్తుందో అన్న ఆందోళన ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తుంది.జనసేన బలంగా ఉన్న చోట్లలోనే తెలుగుదేశం కూడా బలంగా ఉందని ఇప్పుడు మిత్ర ధర్మం కింద ఆ సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంతకాలం పార్టీ కోసం పడిన కష్టం వృధా అయినట్లే అంటూ కొంతమంది ఆందోళన పడుతున్నారట .

Telugu Alapatirajendra, Ap, Chandrababu, Jagan, Janasenatdp, Pawan Kalyan, Tdp S

తెనాలి టిడిపి ఇంచార్జ్ ,మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 2024 లో తెనాలి నుంచి తానే పోటీ చేస్తానంటూ మీడియా ముఖంగా ప్రకటించారు.ఈ సీటును ఇప్పటివరకు పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కి ఇస్తారని వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ సీటు నాదే అంటూ ఆయన ప్రకటించడం ద్వారా తెలుగుదేశం సీనియర్లు తమ గొంతు పెంచుకున్నట్లుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తీరాలనే పట్టుదలతో సీనియర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇదే ధోరణి కొనసాగితే మాత్రం జనసేన తెలుగుదేశం పొత్తుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube