టీడీపీ లో ఏం జరుగుతోంది ? నిరసనలకు దూరంగా వీరంతా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడేందుకు సరైన అవకాశం దొరికింది.టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

 Tdp Senior Leaders Who Did Not Take Part In Protests On Behalf Of The Party, Tdp-TeluguStop.com

దీంతో వైసిపి కార్యకర్తలు ఆగ్రహం చెంది టిడిపి ప్రధాన కార్యాలయం పై విధ్వంసానికి దిగారు.అలాగే పట్టాభి ఇంట్లోనూ విధ్వంసాన్ని సృష్టించారు.

దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది.ఇక నిన్న టిడిపి అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా వైసిపి టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తోంది.రాజకీయ పార్టీల మధ్యనే కాకుండా జనాలలోను టిడిపి, వైసిపి కి సంబంధించిన వ్యవహారంపై చర్చ జరుగుతోంది.

అయితే ఇటువంటి సమయంలో పార్టీకి అండగా నిలబడి, తమ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వైసిపి ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాల్సిన టిడిపి సీనియర్ నాయకులు చాలామంది ఈ వ్యవహారంలో అసలు తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

అసలు ఈ వయసులో చంద్రబాబు ఈ దీక్షకు దిగడం పెద్ద సంచలనం.

పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని బాబు ఉపయోగించుకుంటున్నారు.కానీ టిడిపి లో ఎన్నో కీలక పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు చాలామంది సైలెంట్ గా ఉండి పోవడం వెనుక కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.

గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు, కిషోర్ చంద్ర దేవ్,  సుజయ్ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు , విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ టిడిపి ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన , స్వామి దాసు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది నాయకులే ఉన్నారు.
 

Telugu Ap, Ashokgajapathi, Bhajangopal, Chandrababu, Ghantasrinivas, Lokesh, Pat

వీరంతా ఈ వ్యవహారంలో తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోవడం ఇప్పుడు టిడిపిలో చర్చనీయాంశంగా మారింది.పార్టీ పుంజుకునేలా చేసేందుకు సరైన అవకాశం వచ్చినా, టిడిపి ప్రభుత్వంలో అనేక కీలక పదవులు అనుభవించిన వారు ఈ విధంగా మౌనంగా ఉండటం సరికాదనే వ్యాఖ్యలు ఆ పార్టీలోని వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube