లోకేష్ పై వైసీపీ తిట్లు ! ఎంజాయ్ చేస్తున్న టీడీపీ సీనియర్లు ?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీపై ఎంత పట్టు ఉందో ఇట్టే అర్థమైపోతుంది.కొన్ని కొన్ని సంఘటనలు లోకేష్ శక్తిసామర్ధ్యాలను రుజువు చేస్తున్నాయి.

 Tdp Senior Leaders Not Support On Nara Lokesh-TeluguStop.com

టిడిపిలో చంద్రబాబు తర్వాత స్థానాన్ని ఆశిస్తున్న లోకేష్ అందుకు తగ్గ రాజకీయాన్ని ఒంటబట్టించుకునే పనిలో ఉన్నారు.సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వం పై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా, వెంటనే అందరికంటే ముందుగా లోకేష్ విమర్శలకు దిగిపోతున్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ స్థాయి నాయకులపై విమర్శలే కాకుండా, చివరికి మండల స్థాయిలో చోటు చేసుకునే చిన్న చిన్న వ్యవహారాల పైన లోకేష్ స్పందిస్తూ, ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేసే పనిలో బిజీగా ఉన్నారు.

 Tdp Senior Leaders Not Support On Nara Lokesh-లోకేష్ పై వైసీపీ తిట్లు ఎంజాయ్ చేస్తున్న టీడీపీ సీనియర్లు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే లోకేష్ విమర్శలకు వైసీపీ ఘాటుగానే సమాధానం ఇస్తోంది.ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు, నియోజకవర్జ ఇంచార్జిలు ఇలా అందరూ లోకేష్ పై ఎదురుదాడికి దిగుతున్నారు.

ఇక వైసీపీ మంత్రి కొడాలి నాని వంటి వారైతే పరుష పదజాలంతో లోకేష్ పై ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నా, టిడిపి నుంచి లోకేష్ కు పెద్దగా మద్దతు ఉన్నట్లు కనిపించడం లేదు.కేవలం దివ్యవాణి వంటివారు తప్పించి, మిగతా పార్టీ సీనియర్లంతా మౌనంగానే ఉండిపోతున్నారు.

దీనికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారంతా లోకేష్ తీరుపై గుర్రుగా ఉన్నారు.

Telugu Chandrababu, Kodali Nani, Lokesh Coments, Nara Lokesh, Tdp Seniour Leaders, Tdp Seniour Leaders Angry On Lokesh, Ysrcp-Telugu Political News

అప్పట్లో తాము స్వతంత్రంగా పని చేసే అవకాశం లేకుండా, లోకేష్ అన్ని వ్యవహారాల్లో తలదూర్చి తమకు తల పోట్లు తెచ్చే వారిని,  తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, తమకు ప్రత్యామ్నాయంగా మరికొంత మంది నేతలను ప్రోత్సహించారనే విషయంపై చాలా కాలంగా పార్టీ సీనియర్ లు రగిలిపోతున్నారు.

ఇంకా అనేక అంశాలలో లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంటూనేే వచ్చారు.ఇప్పుడు వైసిపి నాయకులు అంతా లోకేష్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న , టిడిపి సీనియర్ నాయకులు వాటిని ఖండించకపోగా , లోకేష్ పై వస్తున్న విమర్శలు, తిట్లను బాగా ఎంజాయ్్ చేస్తున్నారట.

#TDP #Lokesh #Chandrababu #Lokesh #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు