బీజేపీ లేక‌పోతే బ‌తుకే లేదా..? టీడీపీ సీనియ‌ర్ల ఫైర్‌  

TDP senior leaders fire on chandra babu naidu due to BJP involvement,TDP,BJP,delhi poitics,chandra babu naidu,senior leaders,fire,behaviour,inside political talk,amaravthi farmers,piyush goyal - Telugu Amaravthi Farmers, Behaviour, Bjp, Chandra Babu Naidu, Delhi Poitics, Fire, Inside Political Talk, Piyush Goyal, Senior Leaders, Tdp

ఔను! ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్లు ఈ ప్ర‌శ్నే సంధిస్తున్నారు.అయితే, బ‌హిరంగంగా మాత్రం కాదు.

TeluguStop.com - Tdp Senior Leaders Fire On Chandra Babu Naidu Due To Bjp Involvement

ఆఫ్ ది రికార్డుగానే.`ఏం మ‌నం బీజేపీతో అంటకాగ ‌లేక‌పోతే.ముందుకు సాగ‌లేమా?!` అంటూ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి వంటివారు వ్యాఖ్యానిస్తున్నారు.“ కాదు త‌మ్ముడూ.బీజేపీ మ‌న‌కి దూరంగా ఉంది.మ‌నం మాత్రం ఎందుకు పాకులాడాలి! ఎందుకు వారి కోసం ఎదురు చూడాలి“ – ఇదీ ఓ కీల‌క నేత వ్యాఖ్య‌.మ‌రి ఎందుకు ఇలా ఇప్పుడు స‌డెన్‌గా వ్యాఖ్యానించారంటే.తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి బీజేపీకి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే!

ఆది నుంచి బీజేపీతో క‌ల‌వ‌డం.

TeluguStop.com - బీజేపీ లేక‌పోతే బ‌తుకే లేదా.. టీడీపీ సీనియ‌ర్ల ఫైర్‌-Political-Telugu Tollywood Photo Image

మ‌ళ్లీ విడిపోవ‌డం.మ‌ళ్లీ చేరువ కావ‌డం.

ఇదీ .చంద్ర‌బాబు రాజ‌కీయం లో ఓ భాగం.గ‌తంలో వాజ‌పేయి ఉన్న రోజుల్లో ఆ పార్టీతో బంధం పెంచుకున్నారు.త‌ర్వాత మ‌ళ్లీ మోడీ హ‌యాంలోనూ 2014లో క‌లిసే ఉన్నారు.అయితే, 2017లో విభేదించిన చంద్ర‌బాబు ఆ పార్టీతో బంధాన్ని తెగ‌తెంపులు చేసుకున్నారు.ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఏపీలో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగారు.

అయితే, ఓడిపోయారు.దీనిపై వ‌చ్చిన విశ్లేష‌ణ‌ల్లో.

బాబు బీజేపీకి దూరం కావ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.ఈ ప‌రిణామాల‌తో అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు బీజేపీకి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు మాత్రం టీడీపీని ప‌క్క‌న పెట్టారు.పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.అయిన‌ప్ప‌టికీ.కేంద్రం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ చంద్ర‌బాబు హ‌ర్షించ‌డం, కొనియాడ‌డం, మెచ్చుకోవ‌డం.ట్వీట్లు చేయ‌డం వంటివి చేస్తూనే ఉన్నారు.దీంతో ఆయ‌న బీజేపీని చేరువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నార‌నే వ్యాఖ్య‌లు బ‌ల‌ప‌డుతూనే ఉన్నాయి.

ఎటొచ్చీ.బీజేపీ మాత్రం జ‌గ‌న్‌కు చేరువ‌గా ఉంటోంద‌నేది జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

తాజాగా.కూడా చంద్ర‌బాబు బీజేపీకి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు.

కేంద్రమంత్రి, బీజేపీ మాజీ సార‌థి అమిత్‌షాకు  చంద్రబాబు ఫోన్ చేశారు.ఆయ‌న‌కు ప‌నిగ‌ట్టుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అక్టోబర్ 22వ తేదీ అమిత్‌షా పుట్టినరోజు.ఈ సందర్భంగా అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

 అంతేకాదు, మ‌రో బీజేపీ నేత‌, ప్ర‌స్తుతమంత్రి, త‌ర‌చుగా జ‌గ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతు‌న్న పీయూష్ గోయల్‌కు కూడా చంద్రబాబు ఫోన్ చేశారు.

పీయూష్ గోయెల్ కిడ్నీలో రాళ్ల తొలగింపు చికిత్స చేయించుకోనున్న విషయం తెలిసిందే.

గోయల్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ప్ర‌య‌త్నాలు చూస్తున్న టీడీపీ సీనియ‌ర్లు.

బీజేపీ లేక‌పోతే.బ‌తుకే లేదా?.అంటూ.బాబుపై ఆఫ్ దిరికార్డుగా ఫైర‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయో లేదో తెలియ‌దు కానీ.పార్టీలో మాత్రం ఏవ‌గింపు క‌నిపిస్తోంది.

#Behaviour #Fire #InsidePolitical #Delhi Poitics #Senior Leaders

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Senior Leaders Fire On Chandra Babu Naidu Due To Bjp Involvement Related Telugu News,Photos/Pics,Images..