బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సాధినేని యామిని  

Sadineni Yamini Join Bjp Party-join Bjp Party,sadineni Yamini,tdp

తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా ఎన్నికలకి ముందు బలమైన వాయిస్ వినిపించిన మహిళా నేత సాధినేని యామిని.రోజా తర్వాత ఆ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన యామిని ఒకానొక సందర్భంగా పార్టీ తరుపున అధికార ప్రతినిధిగా ఉంటూ జనసేన పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడి జనసేన కార్యకర్తల ట్రోలింగ్ కి బలైంది.

Sadineni Yamini Join BJP Party-Join Bjp Party Sadineni Tdp

ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు సొంతం చేసుకొని రాజకీయంగా ఎదగాలని భావించిన ఆమెకి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇవ్వలేదు.దీంతో ఎన్నికల తర్వాత టీడీపీకి ఈ మహిళా లీడర్ దూరంగా ఉంటూ వస్తుంది.

పార్టీలో తనకి అవమానాలు ఎదురవుతున్నాయని, తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా అణిచే ప్రయత్నం చేశారని ఆ మధ్య మీడియా ముందుకి వచ్చి టీడీపీకి రాజీనామా చేసింది.అదే సమయంలో జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల అభివృద్ధి అంటూ చెప్పింది.

ఇక ఒకానొక దశలో కన్నా లక్ష్మినారాయణని కలిసి త్వరలో బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేసింది.అయితే తాజాగా ఆమె కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

వ్యక్తిగత కారణాలతో పాటు రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీ మారినట్లు ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది.అయితే పార్టీ కండువా మార్చిన టీడీపీ మీద ఆమె ఎలాంటి విమర్శలు చేయకుండా తనకి పార్టీలో సముచిత స్థానం ఇచ్చినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పింది.

.

తాజా వార్తలు