టీడీపీకి బ్యూటీఫుల్‌ ఫైర్‌ బ్రాండ్‌ గుడ్‌ బై  

Tdp Sadhineni Yamini Good Bye To Telugudehsam Party In Soon-tdp Sadhineni Yamini

టీడీపీ నాయకురాలు సాదినేని యామినికి మంచి పేరుంది.అందంతో పాటు మంచి తెలివి మాట్లాడే చతురత ఉన్న వ్యక్తి అంటూ సాదినేని యామినికి గుర్తింపు ఉంది.ఆమె తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు.తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీడియా ముందు ఎన్నో సార్లు తన గళం వినిపించారు.

Tdp Sadhineni Yamini Good Bye To Telugudehsam Party In Soon-tdp Sadhineni Yamini-TDP Sadhineni Yamini Good Bye To Telugudehsam Party In Soon-Tdp

మీడియాలో చర్చ కార్యక్రమాల్లో ప్రత్యర్థి పార్టీ వారిని మాట్లాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించేది.అందుకే ఆమెకు ఫైర్‌ బ్రాండ్‌ అంటూ గుర్తింపు వచ్చింది.పార్టీలో కీలక పదవులు దక్కించుకున్న యామిని ఈమద్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది.

ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాదినేని యామిని ఫైర్‌ తగ్గినట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే ఆమె గత కొన్ని రోజులుగా వేరే పార్టీతో కాస్త సన్నిహితంగా మెలుగుతున్నారట.

త్వరలోనే ఆమె పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.ఇటీవల ఒక మీడియా ఆమెతో మాట్లాడిన సమయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం బెటర్‌ అంటూ నా సన్నిహితులు నా మద్దతు దారులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాలని అనుకుంటున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఆమె ఏ పార్టీలో జాయిన్‌ అయ్యే విషయమై క్లారిటీ రాలేదు.వైకాపా లేదా బీజేపీలో ఆమె జాయిన్‌ అవ్వొచ్చు.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైకాపాలోకి వెళ్తే ఆమెకు మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు.

కాని ఆమెను వైకాపా ఆహ్వానిస్తుందా అనేది చూడాలి.