అది `స్టార్‌` జేఏసీనా ?

నిన్న వంగవీటి మోహనరంగాను పోగొట్టుకున్న తాము నేడు .ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమంటూ కాపుల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ని తెలుగుదేశం పార్టీ రెండు రోజులలోగా అమ‌లుకు సిద్ధ‌ప‌డ‌కుంటే అమీతుమీ తేలుస్తామంటూ కాపు జేఎసి అల్టిమేటం జారీ చేయ‌డంపై ఆయా వ‌ర్గాల‌లో విశ్లేష‌ణ ్ర‌పారంభ‌మైంది.

 Tdp Ready To Attack On Jac-TeluguStop.com

ఇంత‌కీ హ‌డావిడిగా స‌మావేశ‌మైన‌ ఈ జేఎసి ఎప్పుడు ప్రారంభ‌మైన దానిపైనా చ‌ర్చించుకోవ‌టం క‌నిపించింది.

జేఏసి పేరుతో జ‌రిగిన స‌మావేశంలో వైసిపి, కాంగ్రెస్ నాయ‌కులు మిన‌హా ఎవ్వ‌రూ లేక పోవ‌టం, పైగా స‌మావేశం హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వ‌హించుకోవ‌టం ప‌ట్ల కూడా కాపు వ‌ర్గం కొంత నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

స‌మావేశం ఏపిలో ఓ ప్రాంతంలో నిర్వ‌హించి, కాపుల‌కోసం పోరాడుతున్న వారిని భాగ‌స్వామ్యం క‌ల్పించి ఉంటే కొంత శాస్త్రీయత ఉండేద‌ని, వాద‌న విన‌వ‌స్తోంది.ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు తక్షణమే జేఏసీ ద్వారా చర్చలు జరపాల‌ని డిమాండ్‌పై విభిన్న వాద‌న‌లు విన‌వ‌స్తున్నాయి.

త‌మ వ‌ర్గానికి చెందిన నాయకులతో త‌మ‌పై బురద జల్లించే కార్యక్రమం చంద్ర‌బాబు చేస్తున్నారని మా దగ్గర ఇంకా పెద్ద బురద ఉంది జాగ్రత్త అంటూ చేసిన హెచ్చ‌రిక‌ల‌తో పాటుగా ఓసామాజిక సమస్యని టెర్రరిజంగా ప్రభుత్వం చూడ‌టంతో, మనం ఏపీలో ఉన్నామా? భారతలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఆందోళన కలుగుతోంద‌ని, రాష్ట్ర ప్రభుత్వ మే ఉద్రిక్తతలను సృష్టిస్తున్న‌ట్లుగా జేఏసీ పేరుతో దాస‌రి, చిరంజీవి, వైసిపీ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల‌లో నిలువు లోతున పాతేసిన కాంగ్రెస్ ఇక ముందు నిల‌దొక్కుకోవ‌టం క‌ష్ట‌మేన‌ని భావిస్తున్న త‌రుణంలో జేఏసి పేరుతో వైసిపితో జ‌త క‌ల‌సి జ‌నం ముందుకు రావాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం జేఏసీ లో ఉన్న నేత‌లు అధికారాన్ని అనుభ‌వించిన‌న్నాళ్లు కాపుల‌కు, అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఏం చేసార‌న్న విష‌య‌మై ఎక్క‌డికక్క‌డ నిల‌దీసేలా దేశం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా అసెంబ్లీ, పార్ల‌మెంట్ల‌లో ఆ నేత‌లు కాపుల కోసం ఏనాడూ మాట్లాడ‌లేద‌ని, అవ‌స‌ర‌మైతే రికార్డుల‌ను చూపేందుకు సిద్ధ‌మేన‌ని దేశం వ‌ర్గాలు చెప్తున్నాయి కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంపై అనంత‌ర‌ ప్ర‌క్రియ‌కు ఏర్ప‌డిన క‌మిటీ నివేదిక ఇచ్చేందుకు ఆగ‌ష్టు వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని, కాని జేఏసి ముసుగులో కాం్ర‌గెస్ నేత‌లు కేవ‌లం తెలుగుదేశం పార్టీని దోషిగా నిల‌పే ందుకు రెండ్రోజుల గ‌డువు ఇవ్వ‌డ మేంట‌ని, ఓ నివేదిక పార్ల‌మెంటు ముందుకు వ‌స్తే, దానిని చ‌ట్ట బ‌ద్ధ‌త క‌లిపించేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో పార్ల‌మెంటు స‌భ్యులుగా ఉన్న వారికి తెలియ‌నిదా? అని మ‌రికొంద‌రు నిల‌దీస్తున్నారు.

ఇక జేఏసిలో ఉద్యోగుల‌కు, మ‌హిళ‌ల‌కు, ఇత‌ర పార్టీల‌కు ఎందుకు స్ధానం లేదో, వారిని ఎందుకు ఆహ్వానించ‌లేదో ఆయా వ‌ర్గాల‌తోనే నిల‌దీస్తూ, అది `స్టార్‌` జేఏసీగా పేర్కొటూ విమ‌ర్శ‌ల జ‌డివాన కురిపించేలా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

శాంతి భ‌ధ్ర‌త‌ల కోణంలో ఉద్రిక్త‌త‌ల‌ను నివారించుకునేందుకు మీడియాలో క‌థ‌నాల‌ను నిలువ‌రించేలా చూస్తే సాక్షికి వంత పాడేలా జేఏసీ పేరుతో కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా క‌ళ్లెం వేయాల‌ని భావిస్తు, పోలీసు వ‌ర్గాలతో జ‌వాబిప్పించే ఆస్కారం ఉంది.

పార్ట‌మెంటు త‌లుపులు వేసి, విభ‌జ‌న చేసిన సోనియా భ‌జ‌న చేస్తున్న నేత‌ల వ్య‌వ‌హారాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తేవాల‌ని, కాంగ్రెస్ పార్టీ వ‌ల్లే ప్ర‌స్తుత క‌ష్టాల‌ని, జ‌నం ముందుకు తీసుకెళ్లాల‌ని దేశం నేత‌లు భావిస్తున్నారు.

ప్ర‌త్యేక హాదా అని నాటి ప్ర‌థానితో మాట మాత్రంగా చెప్పించి విభ‌జ‌న చ‌ట్టంలో ఎందుకు పెట్ట‌లేదన్న విష‌య‌మై నిల‌దీయాల‌ని నిర్ణ‌యించార‌ట‌… మ‌రేం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube