ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై బాణం ఎక్కుపెడుతున్న టీడీపీ.. వ‌ర్కౌట్ అవుతుందా..?

ఏపీలో ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారి పోతోంది.ఇంకొన్ని రోజులు ఇలాగే పోతే ప్ర‌జ‌ల్లో ఉన్న ఇమేజ్ పూర్తిగా దెబ్బ తింటుంద‌ని భావిస్తున్నారు.

 Tdp Raising Issues On Uttarandhra Will It Be A Workout, Tdp , Uttarandhra Issues-TeluguStop.com

అందుకోస‌మే ఇప్పుడు చంద్ర‌బాబు రూటు మార్చి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు త‌న నాయ‌కుల‌ను రెడీ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పుడు ఆయ‌న ఉత్తరాంధ్ర అభివృద్ధి అజెండాను ఎంచుకుంటున్నారు.

ఎందుకంటే ఇక్క‌డ దారుణ‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి ఈ ఎజెండాతో ముందుకు పోతే మంచిద‌ని భావిస్తున్నారంట‌.ఇంఉకోసం ఇక్క‌డ ఉన్న సమస్యలపై పోరుబాట పట్టేందుకు రెడీ అవుతోంది.

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ కంటే కూడా మొద‌టి నుంచి టీడీపీకి ఉత్త‌రాంధ్ర‌లో ఓటు బ్యాంకు బాగానే ఉంటోంది.అందుకోస‌మే ఇక్క‌డ పోరాడితే క‌చ్చితంగా త‌మ ఓటు బ్యాంకు మ‌ల్లీ త‌మ ఖాతాలోకి వ‌స్తోంద‌ని టీడీపీ భావిస్తోంది.

ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు మ‌రీ ముఖ్యంగా నీటి సమస్యలు అనేవి ప్ర‌ధానంగా వినిపిస్తున్న‌వి.దీంతో పాటు ఈ ఏరియాలో ఎక్కువ‌గా విద్యం, అలాగే విద్యలో కూడా చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి.

కాగా ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిచేందుకు ఎన్నికల సమయంలో ప్ర‌తి పార్టీ కూడా చాలానే హామీలు ఇస్తూ ఉన్నా కూడా నెర‌వేర్చ‌ట్లేదు.

Telugu Ap Tdp Ap, Chandra Babu, Janasena, Kidney, Pawan Kalyan, Rayalaseema, Utt

దీంతో ఇక్క‌డ ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయి.ఏ పార్టీ కూడా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం సమస్యలపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌క‌పోవ‌డం ఇప్పుడు టీడీపీ దీన్ని క్యాచ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండే ప్ర‌ధాన స‌మ‌స్య అయిన కిడ్నీ బాధితుల కోసం కూడా జనసేన అధినేత పవన్ అప్ప‌ట్లో పోరాడితే బాగానే రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు టీడీపీ కూడా ఇలాంటి వాటిపై ఫోక‌స్ పెడితే పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌ని అనుకుంటోంది.ప్ర‌ధానంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు నీటి స‌మ‌స్య‌ను తీర్చ‌డంలో టీడీపీ ప్ర‌ధాన పాత్ర గ‌న‌క పోషిస్తే మాత్రం క‌లిసి వ‌స్తుంద‌నే చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube