జగన్ ను ఇరుకున పెట్టేందుకు ఏం చేసేందుకైనా బాబు సిద్దం!

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని( CM Jagan Mohan Reddy ) ఇరుకున పెట్టే ఏ ఒక్క మార్గంను తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు వదిలి పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపిన విషయం తెల్సిందే.

 Tdp President Chandra Babu Naidu Met With Bjp Leaders For Ys Jagan Defeat ,  Ys-TeluguStop.com

తెలుగు దేశం పార్టీ తో బీజేపీ పొత్తుకు నో అంటే వైకాపా ఆ పొత్తును కోరుకుంటుంది అంటూ ప్రచారం జరిగింది.

Telugu Ap Cm, Chandra Babu, Telugu, Ys Jagan-Politics

వైకాపా నాయకులు బీజేపీ ( BJP )తో సన్నిహిత్యంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తానే రెండు మూడు మెట్లు కిందికి దిగి అన్నట్లుగా బీజేపీ నాయకులను కలవడం జరిగింది.ఢిల్లీ లో చంద్రబాబు నాయుడు జరిపిన రాజకీయ చర్చలతో మొత్తం ఏపీ రాజకీయం మొత్తం మారిపోయింది.ఏపీలో తెలుగు దేశం పార్టీ తో ఇప్పటికే జనసేన ( Janasena )పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది.

కానీ బీజేపీ మాత్రం ఇన్నాళ్లు ఆసక్తి చూపించలేదు.కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి నడ్డా మరియు అమిత్ షా( Amit Shah ) లను కలిసి చర్చలు జరపడం వల్ల మొత్తం రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో జగన్‌ యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిని కలిగిస్తోంది.

Telugu Ap Cm, Chandra Babu, Telugu, Ys Jagan-Politics

ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు గాను జగన్ కసరత్తు చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.కానీ ఇప్పటి వరకు వైకాపా నాయకులు ఎవరు కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించడం లేదు.అయితే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా ను ఇరుకున పెట్టి జనాల వద్ద కార్నర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube