తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) బీజేపీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వడం ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచింది.ఏపీ లో ప్రస్తుతం పొత్తుల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జనసేనాని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెల్సిందే.గత కొన్నాళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అంటూ కచ్చితంగా వైకాపా కు పోటీగా ముగ్గురం కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అంటూ వస్తున్నాడు.
2014 పొత్తులు పునరావృతం అయ్యే విధంగా బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీ లు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అంతా భావిస్తున్నారు.ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి బీజేపీ నేతలను కలవడంతో పొత్తు పొడవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.
ముందస్తు ఎన్నికలు ఏపీ లో వస్తాయి అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా బీజేపీ( BJP ) తో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని టీడీపీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు.అయినా కూడా ఈ రేంజ్ లో డిమాండ్ ను కలిగి ఉండటం ఆశ్చర్యంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి తెలుగు దేశం పార్టీ అధినేత తీసుకున్న ఈ కొత్త నిర్ణయంను తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) యొక్క కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారో అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
బీజేపీ తో కలిసి వెళ్లితే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే అవుతుంది.ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిన బీజేపీ తో కలిసి వెళ్లడం అనేది ఆత్మహత్య సదృశ్యం అవుతుందని కొందరు చంద్రబాబు నాయుడును హెచ్చరిస్తున్నారు.
మరి టీడీపీ చంద్రబాబు నాయుడి మాట ఏంటి అనేది చూడాలి.