తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ ? అత్యాశేనా ?

ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీలో బాగా బలపడిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనమైంది.2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.కానీ తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తదితర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, కేవలం రెండు సీట్లు మాత్రమే, ఆ పార్టీ మిగతా పార్టీల సహకారంతో దక్కించుకోగలిగింది.

 Tdp Preparing To Contest In Dubbaka By Election, Tdp, Chandrababu Naidu, Dubbaka-TeluguStop.com

దీంతో తెలుగుదేశం పార్టీ సత్తా తెలంగాణలో ఎంత ఉంది అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.అక్కడ టీడీపీకి చెందిన కీలక నాయకులు అధికార పార్టీ టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవడంతో, పూర్తిగా కనుమరుగయిపోయే పరిస్థితి వచ్చింది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది.ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం తెలంగాణపై ఫోకస్ తగ్గించారు.

గతంలో వారానికి ఒకరోజు తెలంగాణ టీడీపీకి కేటాయిస్తానని చెప్పినా, పెద్దగా పట్టించుకోవడం లేదు.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రమణ మాత్రమే ప్రస్తుతం కొద్దోగొప్పో యాక్టివ్ గా ఉంటూ కనిపిస్తుండగా, మిగతా నాయకులంతా సరైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చస్తున్నారు.

ఇది ఎలా ఉంటే, తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే గా ఉన్న రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో, ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Telugu Chandrababu, Dubbaka, Ellendularamesh, Medhak, Ramalinga Reddy, Tdp Raman

ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోందట.ఈ మేరకు ఇల్లందుల  రమేష్ గుప్తా అనే అభ్యర్థిని అక్కడ పోటీకి నిలిపేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆయన టీడీపీ ఇంచార్జి గా, ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ టీడీపీ ఇంచార్జీగా ఆయన పనిచేస్తున్నారు.2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన మహా కూటమి సహకారంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు మళ్లీ అదే స్థానం కోసం ఆయనను పోటీకి దింపే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి క్యాడర్ పెద్దగా లేదు.ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పోటీకి దిగాలని చూస్తుండడం అత్యాశగానే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే టిఆర్ఎస్ అభ్యర్థి ఓట్లను చీల్చి కాంగ్రెస్ కు మేలు చేసేందుకే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థిని నిలబెడుతున్నారు అనే ప్రచారం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube